దిలీప్ కుమార్ రికార్డ్స్ ఏ హీరోకి సాధ్యం కానివి!

By team teluguFirst Published Jul 7, 2021, 8:56 AM IST
Highlights

బ్రిటీష్ ఇండియా పెషావర్ లో అయేషా బేగం, లాల్ గులాం సర్వర్ దంపతులకు దిలీప్ కుమార్ డిసెంబర్ 11, 1922లో జన్మించారు. 12మంది సంతానంలో ఒకరైన దిలీప్ కుమార్ 1944లో విడుదలైన జ్వర్ భాట మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

బాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. భారత చలన చిత్ర మొదటితరం స్టార్స్ లో ఒకరైన లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ మరణించారు. 98ఏళ్ల దిలీప్ కుమార్ కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. హిందుజా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న దిలీప్ కుమార్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.  

బ్రిటీష్ ఇండియా పెషావర్ లో అయేషా బేగం, లాల్ గులాం సర్వర్ దంపతులకు దిలీప్ కుమార్ డిసెంబర్ 11, 1922లో జన్మించారు. 12మంది సంతానంలో ఒకరైన దిలీప్ కుమార్ 1944లో విడుదలైన జ్వర్ భాట మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత 1947లో విడుదలైన జుంగు ఆయనకు ఫస్ట్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. 1948లో విడుదలైన షహీద్, మేళ అనే చిత్రాలు హిట్ మూవీస్ గా నిలిచాయి. 


1949లో విడుదలైన అందాజ్ నటుడిగా దిలీప్ కుమార్ కి పెద్ద బ్రేక్ ఇవ్వడం జరిగింది. అందాజ్ మూవీలో రాజ్ కపూర్, నర్గిస్ కూడా ప్రధాన రోల్స్ చేశారు.  అదే ఏడాది విడుదలైన షబ్నమ్ దిలీప్ కుమార్ కి మరో భారీ విజయం అందించింది. 


అత్యధిక సినిమా అవార్డ్స్ అందుకున్న నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు దిలీప్ కుమార్. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. భారత సినిమా అవార్డ్స్ లో అత్యున్నతమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఆయనను వరించింది. ఎనిమిది సార్లు ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. 2000 నుండి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నారు.  

click me!