షాకింగ్ న్యూస్...  లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత!

Published : Jul 07, 2021, 08:18 AM IST
షాకింగ్ న్యూస్...  లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత!

సారాంశం

98ఏళ్ల దిలీప్ కుమార్ కొంత కాలంగా వయో సంబంధిత రుగ్మలతో బాధపడుతున్నారు. గత బుధవారం ఆయన శ్వాస ఇబ్బంది సమస్యతో ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. దిలీప్ కుమార్ మేనేజర్, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియాకు తెలియజేశారు.   

బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారు. 98ఏళ్ల దిలీప్ కుమార్ కొంత కాలంగా వయో సంబంధిత రుగ్మలతో బాధపడుతున్నారు. గత బుధవారం ఆయన శ్వాస ఇబ్బంది సమస్యతో ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. దిలీప్ కుమార్ మేనేజర్, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియాకు తెలియజేశారు. 


ఆసుపత్రిలో చేరిన వారం రోజుల తరువాత ఆయన చికిత్స తీసుకుంటూ మరణించడం జరిగింది. దిలీప్ కుమార్ భార్య సైరా భాను మరణించే సమయంలో ఆయనతో ఉన్నారు. బాలీవుడ్ మొదటితరం హీరోలలో ఒకరిగా అనేక మైలురాళ్ళు అందుకున్న దిలీప్ కుమార్ మరణం బాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా, సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సంతాపం ప్రకటిస్తున్నారు. 

దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్ కాగా, మొగల్ ఏ ఆజమ్, దేవ్ దాస్, రామ్ ఔర్ శ్యామ్, అందాజ్, మధుమతి వంటి ఆల్ టైం క్లాసిక్స్ లో ఆయన నటించారు. 1998లో విడుదలైన ఖిలా నటుడిగా ఆయన చివరి చిత్రం. 

PREV
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు