సీనియర్ నటుడు దేవరాజ్ కొడుకు హీరోగా ఓచిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘వైరం’ అనే టైటిల్ గల ఆ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు.
ఈమధ్య కాలంలో యంగ్ హీరోలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. డెబ్యూ ఫిల్మ్స్ తోనే ఆకట్టుకుంటున్నారు. తాజాగా కన్నడ సీనియర్ నటుడు దేవరాజ్ (Devaraj) కొడుకు ప్రణం దేవరాజ్ (Pranam Devaraj) హీరోగా పరిచయం కాబోతున్నాడు. ‘వైరం’(Vairam) అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గతంలోనే ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి Vairam Teaserను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్,సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
సినిమాకు సాయి శివం జంపాన దర్శకత్వం వహిస్తున్నారు. జె.మల్లికార్జున "వైరం" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర టీజర్ ను తాజాగా విడుదల చేశారు. టీజర్ లాంచ్ కు ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ నటులు దేవరాజ్, చంద్ర దేవ రాజ్ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను కూడా లాంచ్ చేశారు. బెనర్జీ, కాశీ విశ్వనాధ్ చేతుల మీదుగా వైరం టీజర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు దేవరాజ్ మాట్లాడుతూ...తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న నా కొడుకును కూడా అదేవిదంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఎంతో కష్టపడి తీసిన నిర్మాత మల్లికార్జునకు ఈ సినిమామా మంచి పేరు తెస్తుందని ఆకాంక్షించారు. KGF లాంటి సినిమాలో నటించిన గరుడ రామ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీ గా ఉందన్నారు.
చిత్ర నిర్మాత జె.మల్లికార్జున మాట్లాడుతూ..దర్శకుడు సాయి చెప్పిన కథ నచ్చడంతో ఈ కథ ను దేవరాజ్ కు చెప్పారన్నారు. కథను నమ్మి అవకాశం ఇచ్చిన దేవరాజ్ కు, తనయుడు ప్రణం దేవరాజ్ కు ధన్యవాదములు తెలిపారు. మా గురువు అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు, టెక్నీషియన్స్ సపోర్ట్ తో సినిమా బాగా వచ్చిందన్నారు.
చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన మాట్లాడుతూ.. తెలుగు, కన్నడ లో బై లింగ్వేల్ గా సినిమా చేశాం.కన్నడలో మంచి హీరో అయిన ప్రజ్వల్ దేవరాజ్, ప్రణం దేవరాజ్ కు వీరి తండ్రి దేవరాజ్ కి నేను చెప్పిన కథ నచ్చడంతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను దేవరాజ్ వంటి స్టార్ హీరో కొడుకు నా సినిమాలో హీరో గా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. గరుడ రామ్ కూడా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.
చిత్ర హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. సాయి నాకు మంచి సినిమా ఇచ్చారు.సామల భాస్కర్ గారు మమ్మల్ని చాలాబాగా చూయించారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. మా తల్లి తండ్రులు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చే వాన్ని కాదు.తెలుగు ప్రేక్షకులు మా నాన్న దేవరాజ్ ను ఆదరించి నట్లే ‘వైరం’ సినిమాతో తనను కూడా ఆదరించాలని కోరుకున్నారు.