తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్30 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్

By Asianet News  |  First Published Mar 18, 2023, 6:39 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి భారీ చిత్రం ‘ఎన్టీఆర్30’ నుంచి బిగ్ అప్డేట్ అందింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అనౌన్స్ మెంట్ రానే వచ్చింది. తాజాగా మేకర్స్ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
 


యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR) నెక్ట్స్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందని అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ‘ఆస్కార్స్’ తర్వాత తారక్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ - కొరటాల దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం ‘ఎన్టీఆర్30’ ఎప్పుడు ప్రారంభం కానుందని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేళకు సినిమా షూటింగ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. దీనిపై అఫీషియల్ గా అప్డేట్ అందించారు. 

నిన్న ‘దాస్ కా ధమ్కీ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ NTR30పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ అడిగినా కుదరదన్నారు. కానీ ఇవ్వాళ బిగ్ అప్డేట్ ను అందించారు. మార్చి 23న సినిమా లాంచింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొరటాల - ఎన్టీఆర్ కాంబోలో మరోసారి రికార్డు బద్దలయ్యే  చిత్రం రావాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. 

Latest Videos

ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. గతనెలలో లాంచింగ్ ఫిక్స్ అనుకున్నా.. తారక్ మరణం, ఆస్కార్స్ ఈవెంట్ తో ఆలస్యం జరిగింది. ఏదేమైనా సినిమాను ప్రారంభించేందుకు డేట్ ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తారక్ సరసన నటించబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  రత్నవేలు సినిమాటోగ్రఫీగా, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా, యుగంధర్ టీ వీఎఫ్ఎక్స్ అందించబోతున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవింద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజాక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారు. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

Storm alert ⚠️ Muhurtam on March 23rd 💥💥 pic.twitter.com/hD7O9Kh675

— NTR Arts (@NTRArtsOfficial)
click me!