మూడోసారి తల్లికాబోతున్న రామ్‌చరణ్‌ ఐటెమ్‌ భామ లీసా హెడెన్‌

Published : Feb 09, 2021, 10:05 AM ISTUpdated : Feb 09, 2021, 10:06 AM IST
మూడోసారి తల్లికాబోతున్న రామ్‌చరణ్‌ ఐటెమ్‌ భామ లీసా హెడెన్‌

సారాంశం

రామ్‌చరణ్‌ ఐటెమ్‌ భామ లీసా హెడెన్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పింది.  మూడోసారి తల్లి కాబోతున్న వెల్లడించింది. ఆమెకి ఇప్పటికే కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డకి జన్మనిచ్చేందుకు రెడీ అవుతుంది. `ఈ జూన్‌లో నెంబర్‌3 రాబోతున్నారు` అని పేర్కొంది లీసా. 

రామ్‌చరణ్‌ ఐటెమ్‌ భామ లీసా హెడెన్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పింది.  మూడోసారి తల్లి కాబోతున్న వెల్లడించింది. ఆమెకి ఇప్పటికే కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డకి జన్మనిచ్చేందుకు రెడీ అవుతుంది. `ఈ జూన్‌లో నెంబర్‌3 రాబోతున్నారు` అని పేర్కొంది లీసా. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోని పంచుకుంది. తన కుమారుడితో ఉన్న ఆ వీడియో ఆకట్టుకుంటుంది. 

ఇందులో లీసా చెబుతూ, `ఇన్నాళ్లు బద్దకం కారణంగా ఈ ప్రకటన కాస్త ఆలస్యం అయ్యింది. ఇప్పుడు నేను మీతో చాట్‌ చేయడానికి ఓ కారణం ఉంది` అంటూ వీడియోని పంచుకుంది. ఇందులో తాను ప్రెగ్నెన్సీ అనే విషయం చెబుతున్న లీసా వద్దకి కుమారుడు జాక్‌ వచ్చాడు. దీంతో ఆమె `జాకీ, అమ్మ పొట్టలో ఎవరున్నారో వీళ్లకి చెప్తావా` అని అడగ్గా, `సిస్టర్‌` అని సమాధానం ఇచ్చాడు జాక్‌. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దాదాపు రెండు లక్షలకుపైగా వ్యూస్‌ని పొందింది. 

చెన్నైకి చెందిన ఈ అమ్మడు బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. 2010లో `హైసా` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. `రాస్కెల్స్`, `క్వీన్‌`, `ది షావ్‌కీన్స్`, `సాంతా బంతా ప్రై. లిమిటెడ్‌`, `హౌజ్‌ఫుల్‌3`, `హే దిల్‌ హై ముష్కిల్‌` చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన `రచ్చ` చిత్రంలో టైటిల్‌ సాంగ్‌లో ఐటెమ్‌ గర్ల్ గా ఓ ఊపు ఊపింది. దీంతోపాటు పలు టీవీ షోస్‌ చేస్తుందీ అమ్మడు. హెడెన్‌ 2016లో డినో లల్వానీని వివాహం చేసుకుంది. 2017లో వీరికి కుమారు జాక్‌ జన్మించారు. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో లియో కూతురు జన్మించగా, ఇప్పుడు మూడోసారి ప్రెగ్నెంట్‌ అయ్యింది.

 సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లీసా హెడెన్‌... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తున్నారు. తల్లి కావడంలోని మాధుర్యాన్ని వివరిస్తూ గతంలో అనేక ఫొటోలు షేర్‌ చేశారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌