బీర్లకే లక్షన్నర బిల్లు చేశామన్న నటుడు బ్రహ్మాజీ!

Published : Feb 15, 2023, 02:21 PM IST
బీర్లకే లక్షన్నర బిల్లు చేశామన్న నటుడు బ్రహ్మాజీ!

సారాంశం

నటుడు బ్రహ్మాజీ ఒక చిత్ర షూటింగ్లో జరిగిన ఆసక్తికర విషయం వెల్లడించారు. పబ్ సీన్ షూట్లో ఒరిజినల్ బీర్లు తాగగా బిల్లు లక్షల్లో అయ్యిందంటూ తెలియజేశారు. 

నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా పోస్ట్స్, కామెంట్స్ భిన్నంగా ఉంటాయి. సినిమా వేదికల మీద కూడా ఆయన  ప్రసంగాలు ఆసక్తిరేపుతుంటాయి. అలాగే నచ్చని విషయాలు, వ్యక్తులపై పరోక్షంగా ట్వీట్స్ వేస్తూ ఉంటారు. కాగా ఓ మూవీ షూట్ కోసం దండిగా బీరు తాగి లక్షన్నర బిల్లు చేశారట యాక్టర్స్. బ్రహ్మాజీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ #మెన్ టూ. ఈ చిత్ర కథలో భాగంగా ఒక సన్నివేశం పబ్ లో వారం రోజులు షూట్ చేశారట. బ్రహ్మాజీతో పాటు సీన్లో పాల్గొన్న నటులు ఒరిజినల్ బీర్స్ తాగారట. షూటింగ్ ముగిశాక బీరు సీసాలకైన బిల్లు చూసి నిర్మాత గుండె ఝల్లుమందట. బిల్లు లక్షల్లో రావడంతో ఖంగుతిన్నాడట. చేసేది లేక ఉసూరుమంటూ కట్టాడట. ఈ విషయాన్ని బ్రహ్మాజీ స్వయంగా వెల్లడించారు. 

ఇక #మెన్ టూ చిత్రానికి శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు . మౌర్య సుధావరం నిర్మాతగా ఉన్నారు. ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఇక మూడు దశాబ్దాలుగా బ్రహ్మాజీ పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో హీరో, సెకండ్ హీరో రోల్స్ కూడా చేశారు. దర్శకుడు కృష్ణవంశీ, రవితేజ ఈయనకు బెస్ట్ ఫ్రెండ్స్. 

ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా కొనసాగుతున్నారు. ఇక రాజకీయ, సామాజిక విషయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఆ మధ్య మెగా ఫ్యామిలీ దానధర్మాలను, చిన్న నటులు చూపించే ప్రేమను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. రోజా కామెంట్స్ కి బ్రహ్మాజీ ఇండైరెక్ట్ గా సెటైర్ వేశారు. అనసూయను కూడా ఈయన పరోక్షంగా టార్గెట్ చేశారనే వాదన ఉంది. అనసూయను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్న సమయంలో... ఆమె పలువురి మీద కేసుపెడతా అన్నారు. ఆ సమయంలో బ్రహ్మజీ 'ఎవడ్రా అంకుల్... నీమీద కేసు పెడతా' అని ట్వీట్ చేశారు. అది నేరుగా అనసూయను టార్గెట్ చేసినట్లు అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో