చిరు కోసం చరణ్ విలన్...సూపర్ న్యూస్..!

Published : Nov 20, 2020, 05:28 PM IST
చిరు కోసం చరణ్ విలన్...సూపర్ న్యూస్..!

సారాంశం

ఇటీవలే ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దాదాపు 40 శాతం వరకు చిత్ర షూటింగ్ జరిగినట్లు సమాచారం. కాగా ఈ మూవీలో విలన్ పాత్ర కోసం టాలెంటెడ్ నటుడు అరవింద స్వామిని ఎంపిక చేశారట. మూవీ కథ రీత్యా విలన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో అరవింద స్వామిని ఎంపిక చేశారట. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వకున్నప్పటికీ, దాదాపు ఖాయమే అంటున్నారు.

చిరు కోసం చరణ్ విలన్...సూపర్ న్యూస్..!

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస చిత్రాలు చేస్తున్నారు. పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి సినిమాలలోకి కమ్ బ్యాక్ ఇచ్చిన చిరంజీవి, ఖైదీ 150తో పాటు సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చిరంజీవి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నారు. లాక్ డౌన్ ముందు వరకు ఆచార్య షూటింగ్ నిరవధికంగా సాగింది. 

ఇటీవలే ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దాదాపు 40 శాతం వరకు చిత్ర షూటింగ్ జరిగినట్లు సమాచారం. కాగా ఈ మూవీలో విలన్ పాత్ర కోసం టాలెంటెడ్ నటుడు అరవింద స్వామిని ఎంపిక చేశారట. మూవీ కథ రీత్యా విలన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో అరవింద స్వామిని ఎంపిక చేశారట. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వకున్నప్పటికీ, దాదాపు ఖాయమే అంటున్నారు. 

గతంలో అరవింద స్వామి రామ్ చరణ్ నటించిన ధ్రువ మూవీలో విలన్ గా చేశారు. ఇంటెలిజెంట్ విలన్ పాత్రలో అరవింద స్వామి నటన అందరినీ అబ్బురపరిచింది. అప్పుడు చరణ్ కి విలన్ గా చేసిన అరవింద స్వామి, చిరంజీవికి కూడా విలన్ గా చేయనున్నారని ఇండస్ట్రీ టాక్. 

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి