ప్రభుదేవా షాక్‌.. సీక్రెట్‌గా సెకండ్‌ మ్యారేజ్‌?

Published : Nov 20, 2020, 12:58 PM ISTUpdated : Nov 20, 2020, 01:06 PM IST
ప్రభుదేవా షాక్‌.. సీక్రెట్‌గా సెకండ్‌ మ్యారేజ్‌?

సారాంశం

ప్రభుదేవా ఇప్పుడు పెద్ద షాక్‌ ఇచ్చాడు. రహస్యంగా రెండో పెళ్ళి చేసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బీహార్‌కి చెందిన ఓ డాక్టర్‌ని ఆయన మ్యారేజ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా పెళ్ళి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నారు. ఆయన మొదట రామలతని వివాహం చేసుకుని 2011లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత స్టార్‌ హీరోయిన్‌ నయనతారతో ప్రేమాయణం సాగించి పెళ్లి వరకు వెళ్ళాడు. చివరి నిమిషంలో అది క్యాన్సిల్‌ అయ్యింది. ఇటీవల తన బంధువులకు చెందిన ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. 

కానీ ఇప్పుడు ఏకంగా పెద్ద షాక్‌ ఇచ్చాడు ప్రభుదేవా. రహస్యంగా రెండో పెళ్ళి చేసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బీహార్‌కి చెందిన ఓ డాక్టర్‌ని ఆయన మ్యారేజ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రభుదేవా వెన్నముక సమస్యతో బాధపడ్డారు. దీనికి ఆయన ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఆయనకు చికిత్సను అందించిన డాక్టర్‌తోనే ప్రభుదేవా ప్రేమలో పడ్డాడట. కొంత కాలం చాలా రహస్యంగా డేటింగ్‌ చేసిన ఈ జోడి.. సెప్టెంబర్‌లోనే మ్యారేజ్‌ చేసుకున్నట్టు తెలుస్తుంది. ముంబయిలోని ప్రభుదేవా నివాసంలో ఈ మ్యారేజ్‌ చాలా సీక్రెట్‌గా జరిగిందని, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారని సమాచారం. ప్రభుదేవాకి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ వార్త లీకైనట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ప్రభుదేవాకి ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భార్య రామలతకి జన్మించారు. ఇక ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా `రాధే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాని వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?