హీరో అడివి శేష్ కి డెంగ్యూ, ఆసుపత్రిలో చికిత్స..ప్లేట్ లెట్స్ డౌన్!

Published : Sep 20, 2021, 02:18 PM IST
హీరో అడివి శేష్ కి డెంగ్యూ, ఆసుపత్రిలో చికిత్స..ప్లేట్ లెట్స్ డౌన్!

సారాంశం

ప్రతిభ ఉన్న టాలీవుడ్ యువ హీరోలలో అడవి శేష్ ఒకరు. హాలీవుడ్ స్టైల్ లో థ్రిల్లర్ చిత్రాలతో అడవి శేష్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం శేష్ మేజర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతిభ ఉన్న టాలీవుడ్ యువ హీరోలలో అడవి శేష్ ఒకరు. హాలీవుడ్ స్టైల్ లో థ్రిల్లర్ చిత్రాలతో అడవి శేష్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం శేష్ మేజర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శేష్ ఆ తర్వాత హీరోగా మారాడు. 

క్షణం, గూఢచారి, ఎవరు లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా అడవి శేష్ కొన్ని రోజుల క్రితం డెంగ్యూ బారీన పడ్డాడు. రక్తంలో ప్లేట్ లెట్స్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త కొంచెం అభిమానులని కలవరపాటుకు గురి చేస్తోంది. సెప్టెంబర్ 18న శేష్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడట. 

ప్రస్తుతం వైద్యుల బృందం అతడిని క్లోజ్ గా మానిటర్ చేస్తూ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అడవి శేష్ తదుపరి హెల్త్ అప్డేట్ ని వైద్యులు అధికారికంగా ప్రకటించనున్నారు. 

ప్రస్తుతం అభిమానులు అడవి శేష్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అడివి శేష్ పంజా, బాహుబలి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రస్తుతం శేష్ నటిస్తున్న మేజర్ మూవీ శశి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శేష్ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు