నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం.. నటి భావోద్వేగ పోస్ట్

Published : Sep 20, 2021, 01:21 PM ISTUpdated : Sep 20, 2021, 01:30 PM IST
నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం.. నటి భావోద్వేగ పోస్ట్

సారాంశం

`అక్షర` ఫేమ్‌ నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నందిత తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని నందిత శ్వేత పంచుకుంటూ ట్విట్టర్‌ ద్వారా ఓ ఎమోషనల్‌ పోస్ట్ ని షేర్‌ చేసింది. 

హీరోయిన్‌ నందిత శ్వేత ఇంటి తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి కన్నుమూశారు. దీంతో నందిత ఫ్యామిలీ తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. ఆదివారం తన తండ్రి చనిపోయినట్టు నందిత శ్వేత ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. `నా తండ్రి శ్రీ శివస్వామి 54ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా.  నా తండ్రి లోటు తీరనిది. ఆయన మృతి పట్ల చాలా చింతి స్తున్నాన` అని ట్వీట్ చేసింది నందిత.

దీంతో ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నందిత ఫ్యామిలీకి ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నారు. కర్నాటకకి చెందిన నందిత శ్వేత నిఖిల్‌ నటించిన `ఎక్కడికిపోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు 2008లో `నందా లవ్స్ నందిత` అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తమిళంలో పదికిపైగా చిత్రాల్లో నటించిన తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో ఆకట్టుకుందీ భామ. 

ఆ తర్వాత `శ్రీనివాస కళ్యాణం`, `బ్లఫ్‌ మాస్టర్‌`, `ప్రేమ కథా చిత్రమ్‌ 2`, `అభినేత్రి`, `సెవెన్‌`, `కల్కి`, `కపటదారి`, `అక్షర` చిత్రాల్లో నటించి మెప్పించింది. `అక్షర`లో మెయిన్‌ లీడ్‌గా ఆకట్టుకోవడం విశేషం. ప్రస్తుతం తమిళంలో `ఎంజీఆర్‌ మగన్‌` సినిమాలో నటిస్తుంది. తెలుగులో ఈ బ్యూటీకి సినిమాలు లేకపోవడం గమనార్హం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?