విక్రమార్కుడు 2 కథ రెడీ.. కానీ రాజమౌళి దర్శకత్వంలో కాదా ?

By telugu teamFirst Published Sep 20, 2021, 1:25 PM IST
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు 2 చిత్రం రవితేజ కెరీర్ లో ఓ మెమొరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో రవితేజ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు 2 చిత్రం రవితేజ కెరీర్ లో ఓ మెమొరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో రవితేజ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. రవితేజ మార్క్ కామెడీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్స్, అనుష్క గ్లామర్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

2006లో విడుదలైన విక్రమార్కుడు చిత్రం ఘన విజయం సాధించింది. ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే విక్రమార్కుడు 2 కథని సిద్ధం చేశారట. విక్రమార్కుడు 2 చిత్రానికి దర్శకత్వంలో వహించేందుకు రాజమౌళి రెడీగా లేరు. ఆర్ఆర్ఆర్ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో జక్కన్న బిజిగా ఉన్నాడు. అలాగే తదుపరి చిత్రం మహేష్ బాబుతో కమిట్ అయి ఉన్నాడు. 

సో రాజమౌళి విక్రమార్కుడు 2ని డైరెక్ట్ చేయడం ఇప్పట్లో కుదరదు. కాబట్టి దర్శకుడు సంపత్ నందిని ఈ చిత్రం కోసం సంప్రదించారట. అంతా ఓకె అయితే ఈ చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. రవితేజ హీరోగా కొనసాగుతారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్ర కథని పాన్ ఇండియా లెవల్ లో రూపొందించినట్లు తెలుస్తోంది. 

విక్రమార్కుడు 2 పట్టాలెక్కితే రవితేజ నటించే తొలి పాన్ ఇండియా మూవీ ఇదే అవుతుంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల్లో నటిస్తున్నాడు. పోలీస్ పాత్రలు రవితేజకు బాగా కలసి వస్తాయి. విక్రమార్కుడు రవితేజ పవర్ ఫుల్ కాప్ గా నటించాడు. ఆ తర్వాత పోలీస్ గా నటించిన పవర్, క్రాక్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. 

click me!