యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమాగా ‘‘కురుక్షేత్రం’’

Published : May 30, 2017, 10:08 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమాగా ‘‘కురుక్షేత్రం’’

సారాంశం

యాక్షన్ కింగ్ అర్జున్ 150వ చిత్రం టైటిల్ కురుక్షేత్రం మోహన్ లాంటి అగ్రహీరోను డైరెక్ట్ చేసిన  డైరెక్టర్ అరుణ్ వైద్యనాథన్ వైద్యనాథన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘‘కురుక్షేత్రం’

యాక్షన్ కింగ్ అర్జున్ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. కెరీర్ లో అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే 150సినిమా చేస్తున్నాడు. మళయాలం లో మోహన్ లాంటి అగ్రహీరోను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అరుణ్ వైద్యనాథన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి తెలుగులో ‘‘కురుక్షేత్రం’’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తమిళ్ లో ‘‘నిబునన్’’గా కన్నడలో ‘‘విస్మయ’’ రాబోతోంది. కంప్లీట్ థ్రిల్లర్ మూవీగా రానున్న ‘కురుక్షేత్రం’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పూర్తి వైవిధ్యంగా కనిపిస్తోన్న ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే ఇదో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా కనిపిస్తోంది. ఆరంభం నుంచి చివరికి వరకూ అత్యంత ఉత్కంఠగా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలంగా చెబుతున్నారు.

                                   

ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నమైన, అద్భుతమైన పాత్రను అర్జున్ ఇందులో పోషించారు. ఊహకందని మలుపులు, ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో అర్జున్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కంప్లీట్ స్టైలిష్ థ్రిల్లర్ గా రూపొందే ఈ మూవీ టీజర్ ఆల్రెడీ తమిళ కన్నడ భాషల్లో రిలీజ్ అయి దుమ్మురేపుతోంది. అక్కడి సినీ పెద్దలంతా అర్జున్ కు ముందే కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆ స్థాయిలో ఉందీ టీజర్. ఇక తెలుగులో రిలీజ్ చేసిన ‘కురుక్షేత్రం’ ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో మెమరబుల్ హిట్స్, అవార్డ్స్ అందుకున్న అర్జున్ .. రేరెస్ట్ మైల్ స్టోన్ లాంటి 150వ సినిమాను మరింత మెమరబుల్ గా మార్చుకోవడం ఖాయం అంటున్నారు.. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ తెలుగు టీజర్ ను కూడా అతి త్వరలోనే విడుదల చేసి.. సినిమాను జులై నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్.సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు : సంగీతం : ఎస్.నవీన్, సినిమాటోగ్రఫీ : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : సతీష్ సూర్య, నిర్మాణం-ప్యాషన్ స్టూడియోస్, కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్..

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?