NBK 107: బాలయ్య 107 సినిమాతో మోక్ష‌జ్ఞ టాలీవుడ్ ఎంట్రీ, ఎంత వరకూ నిజం...?

By Mahesh Jujjuri  |  First Published Apr 29, 2022, 4:12 PM IST

నందమూరి నట వారసులుగా బాలకృష్ణ ఆతరువాత జూనియర్ ఎన్టీఆర్ సిల్మర్ స్క్రీన్ పై దుమ్మురేపారు. ఇప్పటికి దడదడలాడిస్తున్నారు. ఇర ఇక ఇప్పుడు బాలయ్య వారసుడుగా   మోక్ష‌జ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 
 


నందమూరి నట వారసులుగా బాలకృష్ణ ఆతరువాత జూనియర్ ఎన్టీఆర్ సిల్మర్ స్క్రీన్ పై దుమ్మురేపారు. ఇప్పటికి దడదడలాడిస్తున్నారు. ఇర ఇక ఇప్పుడు బాలయ్య వారసుడుగా   మోక్ష‌జ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 

నంద‌మూరి బాల‌కృష్ణ న‌ట‌ వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడూ...? ఎన్నో రోజులుగా    అభిమానుల ప్రశ్న ఇది. కాని ఇప్పటి వరకూ ఫ్యాన్స్ కు సమాధానం దొరకలేదు. బాలకృష్ణ నటవారసుడి గురించి ఎప్పటి నుంచో  ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్. గ‌తంలో మెక్ష‌జ్ఞ కోసం ప్ర‌ముఖ రైట‌ర్ సాయి మాధ‌వ్ బుర్ర ఓ క‌థ‌ను సిద్ధం చేశాడని, ఆ క‌థ బాల‌కృష్ణ‌కు ఎంత‌గానో న‌చ్చింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవ‌న్ని నిజాలు కావని తెలిశాయి.

Latest Videos

ఇక ఆ త‌ర్వాత కొన్ని రోజ‌ల‌కు బాల‌కృష్ణ‌కు పైసా వ‌సూల్ లాంటి మాస్ హిట్  ఇచ్చిన‌ పూరీ డైరెక్షన్ లో మోక్ష‌జ్ణ ఎంట్రీ ఉండ‌బోతుంది అని ప్ర‌చారం  గట్టిగానే  సాగింది. అది కూడా  రూమర్ గానే మిగిలిపోయింది. అయితే రీసెంట్ గా మరో వార్త తెరపైకి వచ్చింది. నందమూరి వారసుడు మోక్ష‌జ్ఞ, బాల‌కృష్ణ సినిమాతో నట ప్రస్తానాన్ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం. 

బాలయ్య బాబు ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని  డైరెక్షన్ లో మాస్ యాక్ష‌న్ సినిమాను చేస్తున్నాడు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు రెస్పాన్స్ అదిరింది. నంద‌మూరీ అభిమానుల‌తో పాటు ఆడియన్స్ అంతా కూడా ఈసినిమా గురించి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇక ఇప్పుడు తాజాగా మోక్ష‌జ్ఞ చేసిన ట్వీట్ నెట్టంట వైర‌ల్‌గా మారింది. మోక్ష‌జ్ఞ త‌న ట్విట్ట‌ర్‌లో నైట్ షూట్ #NBK107 అని ట్వీట్ చేశాడు. మోక్ష‌జ్ఞ చేసిన ఈ ట్వీట్ సినీప‌రిశ్ర‌మ‌లో మ‌రో చ‌ర్చ‌కు దారి తీసింది. బాల‌కృష్ణ సినిమాతో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా? అంటూ నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే  మరికొంత మంది మాత్రం  బాల‌కృష్ణ‌తో క‌లిసి న‌టిండమ్ నిజమో కాదో ఎవరికి తెలుసు..? షూటింగ్ చూడటానికి వెళ్లి ఉంటాడు అని అంటున్నారు. 

click me!