
వరుసగ ప్లాప్ లతో కెరీర్ లో స్ట్రగుల్ పీరియడ్ ను ఫేస్ చేస్తున్నారు డైరెక్టర్ శ్రీను వైట్ల. ఇక తన కెరీర్ లో సక్సెస్ ఫుల్ మూవీస్ సీక్వెల్స్ పైన దృష్టి పెట్టిన ఆయన.. ఢీ సీక్వెల్ కోసం అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. కాని ఇప్పుడా సినిమా ఏమైనట్టు..?
ఒకప్పుడు డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమా అంటే మంచి కథ, కడుపుబ్బా నవ్వుకునే కామెడీ అని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లేవారు ఆడియన్స్. కాని తరువాత తరువాత ఆయన సినిమాలను ఆదరించడం మానేశారు. ఇక తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస హిట్లు చూస్తూ వచ్చిన శ్రీను ఆతరువాత నుంచి వరుసగా ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేస్తున్నాడు టీవుడ్ దర్శకుడు. దాంతో సహజంగానే ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా సరే పట్టువదలని విక్రమార్కుడిలా.. శ్రీను తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే మంచు విష్ణు హీరోగా తాను డైరెక్ట్ చేసిన తన సూపర్ హిట్ మూవీ ఢీ సీక్వెల్ చేయాలనుకున్నాడు. డీ అండ్ డీ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో చేయనున్నట్టు విష్ణు చెప్పాడు.
అయితే అంతా బాగానే ఉంది. సినిమా ఇక సెట్స్ పైకి వెళ్ళడమే తరువాయి అనుకుంటే ఇప్పటి వరకూ ఈసినిమా పట్టాలపైకి మాత్రం వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందా .. లేదా? అనే సందేహం అందరిలోను ఉంది. ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఒక వేళ ఉంటే.. ఇప్పటి వరకూ ఎందుకు సెట్స్ పైకి వెళ్లలేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతే కాదు శ్రీను వైట్ల మరో కథను మరో హీరోతో చేసుకోవడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడని టాలీవుడ్ టాక్. ముందే ప్రకటించిన ఢీ అంటే ఢీ వదిలేసి మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం తన సొంత బ్యానర్లో గాలి నాగేశ్వరరావు చేస్తున్నాడు. సన్నిలియోన్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగు షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మరి ఢీ అంటే ఢీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలు ఉంటుందా లేదా అనే క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు టీమ్.