‘ఆచార్య’ లో అదిరిపోయే ఆరు పాటలు.. వాటి నేపథ్యాలు..

By Surya Prakash  |  First Published Mar 6, 2021, 11:28 AM IST

ఆచార్య సినిమా ద్వారా తొలిసారిగా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి పూర్తి నిడివి కలిగిన పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ముగించుకున్నాడు. 20 రోజుల పాటు జరిగిన ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో రామ్ చరణ్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు ముగిసినట్టేనని తెలుస్తోంది. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్ ముగించుకున్న చరణ్, హైదరాబాద్ వచ్చేశాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న  ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం పాటలపై అందరి దృష్టీ పడింది.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ‘ఆచార్య’ కోసం మణిశర్మ అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేశారు. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయని తెలిసింది. వీటిలో చిరంజీవి, కాజల్ మధ్య వచ్చే ఓ రొమాంటిక్ డ్యూయిట్ సాంగ్ హైలెట్ గా ఉంటుందిట. అలాగే ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా..చిరంజీవితో కలిసి స్టెప్స్ వేయనుంది.
 
ఇవి కాకుండా మరో రెండు డివోషనల్ సాంగ్స్ ఉంటాయి. ఓ పాట శివుడు మీద, మరో పాట కాళిక దేవి మీద ఎమోషన్ గా సాగుతుంది ఓ ఫైట్ నేపధ్యంలో . అలాగే చరణ్ – పూజా హెగ్డే మధ్య ఇంకొకటి ఉంటుందని సమాచారం. ఫైనల్ గా రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే ఓ మాస్ సాంగ్ హైలెట్ గా ఉంటుంది.  మెగాస్టార్ కెరీర్‌లోనూ గతంలో ఎన్నడూ చూడని స్టెప్పులు, గ్రేస్ కనిపించేలా సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారని  టాక్. ఇక, చరణ్‌ ఎంట్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. 
   
 ‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ప్రమఖ దర్శకుడు... కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా.. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా చిత్రం టీమ్ నిలిపివేసింది.ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
Latest Videos

click me!