శర్వానంద్‌ బర్త్ డే ట్రీట్స్ .. `మహాసముద్రం`లో మాస్‌ లుక్‌లో.. గూస్‌బమ్స్..

Published : Mar 06, 2021, 09:41 AM IST
శర్వానంద్‌ బర్త్ డే ట్రీట్స్ .. `మహాసముద్రం`లో మాస్‌ లుక్‌లో.. గూస్‌బమ్స్..

సారాంశం

యంగ్‌ హీరో శర్వానంద్‌ బర్త్ డే నేడు(మార్చి 6). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ట్రీట్స్ వచ్చేశాయి. ఇప్పటికే `శ్రీకారం` ట్రైలర్‌ సందడి చేస్తుండగా, తాజాగా `మహాసముద్రం` ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. దీంతోపాటు కొత్త సినిమాని ప్రకటించారు. అలాగే బర్త్‌ డే సీడీపీ వైరల్‌ అవుతుంది.

యంగ్‌ హీరో శర్వానంద్‌ తన ఫ్యాన్స్ కి బర్త్ డే(మార్చి 6) ట్రీట్‌ ఇచ్చారు. ఒక్క రోజు ముందే(శుక్రవారం) తాను నటిస్తున్న `శ్రీకారం` ట్రైలర్‌ని విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా మరో సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో `మహాసముద్రం` చిత్రంలో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఇందులో మరో హీరో. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని శర్వానంద్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో శర్వానంద్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి మాస్‌ లుక్‌లో శర్వానంద్‌ ఎప్పుడూ కనిపించలేదు. చేతిలో ఇనుప ఆయుధం పట్టుకుని కోపంగా ఉన్నాడు శర్వానంద్‌. ఆయుధం నుంచి రక్తం కారుతుంది. శర్వా ముఖంలో కోసం, ఆవేశం కలగలిపి ఉన్నాయి. వెనకాల బీచ్‌లో ఇసుక తిన్నెలు, పడవలు, సముద్రం, దూరంగా ఇళ్లు ఉన్నాయి. తాజా లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

మరోవైపు శర్వానంద్‌ బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా బర్త్ డే సీడీపీని విడుదల చేశారు. ఇందులో శర్వా సినిమాల్లోని గెటప్‌లు, వెనకాలు ఆయన సినిమా  పోస్టర్లున్నాయి. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. దీంతోపాటు శర్వానంద్‌ కొత్త సినిమాని ప్రకటించారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాని ప్రకటించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ కాసేపట్లో రానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌