
అభిజిత్ బిగ్‌బాస్4 హౌజ్‌లో రొమాంటిక్ పర్సన్. అఖిల్‌కి పోటీనిచ్చే వ్యక్తి. అఖిల్‌కి మండటానికి కారణం అభిజిత్. మొదట వీరిద్దరు కలిసి మోనాల్‌కి లైనేశారు. అయితే మోనాల్‌ని అఖిల్ తన వైపు తిప్పుకున్నాడు. ఈ క్రమంలో ఏర్పడిన క్లాషెస్ అభిజిత్.. మోనాల్‌కి దూరమయ్యేలా చేసింది.
అప్పట్నుంచి అభిజిత్ ఒంటరయ్యాడు. తను ఓ హారికకు లైనేస్తున్నట్టు పలు సందర్భాల్లో పరోక్షంగా అర్థమయ్యింది. అయితే ఆయన్ని మాత్రం అరియానా బాగా ఇష్టపడుతుంది. అభిజిత్ టాపిక్ వచ్చిన ప్రతిసారి అరియానా విచిత్రంగా, ఎగ్జైటింగ్‌గా బిహేవ్ చేస్తుంది. తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య రహస్య రొమాన్స్ బయటపడింది.
40వ రోజు లేడీ కంటెస్టెంట్లకి నైట్ పార్టీ చేసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఎపిసోడ్ ఆద్యంతం కట్టిపడేసింది. ఇందులో అమ్మాయిలు పార్టీలో అబ్బాయిలుగా బిహేవ్ చేయగా, వారి ముందు పాల్గొన్న అభిజిత్, అమ్మ రాజశేఖర్, సోహైల్, అఖిల్ అమ్మాయిలుగా ప్రవర్తించారు. అయితే అందుకు అభిజిత్ భిన్నంగా వ్యవహరించారు.
మొదటగా ఈ అమ్మాయిల పార్టీ క్లబ్‌కి వెళ్ళిన అభిజిత్ వారి అందాలను పొగిడాడు. అరియానా అందంగా ఉందని, బ్యూటీఫుల్ అని చెప్పగా, హారిక అమేజింగ్ అని, గార్జియస్‌గా ఉన్నావన్నాడు. లాస్యని చాలా బాగా కనిపిస్తున్నావని ప్రశంసలు కురిపించాడు. దివి గురించి ఏం చెప్పను అంటూ ఆమెకి బిస్కెట్ వేశాడు. ఈ క్రమంలో అరియానా.. డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తావని అడగ్గా.. నీతోనే అని అరియానాకి బదులిచ్చారు. అందుకు ఆరియానా ఎగిరి గంతేయడమేకాదు, అభిజిత్‌కి థ్యాంక్స్ చెప్పడం విశేషం. అనంతరం అభిజిత్‌తో స్టెప్పులేయించారు. మొత్తంగా అరియానా, అభిజిత్ మధ్య సీక్రెట్‌గా ఏదో జరుగుతుందని మరోసారి స్పష్టమైందని చెప్పొచ్చు.