యాదాద్రి ఆర్కిటెక్చర్‌ ని సత్కరించి ఫ్రెండ్‌షిప్‌ని చాటుకున్న పవన్‌

Published : Oct 16, 2020, 08:46 PM ISTUpdated : Oct 16, 2020, 08:56 PM IST
యాదాద్రి ఆర్కిటెక్చర్‌ ని సత్కరించి  ఫ్రెండ్‌షిప్‌ని చాటుకున్న పవన్‌

సారాంశం

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆర్కిటెక్చర్‌, ఆర్‌ డైరెక్టర్ ఆనంద సాయిని  పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా సత్కరించారు. 

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణాన్నిరూపొందించిన ప్రధాన ఆర్కిటెక్చర్‌, ఆర్ట్ డైరెక్టర్‌ ఆనంద సాయిని  జనసేన అధ్యక్షుడు, హీరో పవన్‌ కళ్యాణ్‌ సత్కరించారు. ఆనంద సాయి ఇటీవల `ధార్మిక రత్న` పురస్కారం అందుకున్నారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించారు. 

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌.. ఆనంద సాయిని అబినందించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయమన్నారు. ఆలయ నిర్మాణం, దానికి సంబంధించిన వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆనంద సాయికి ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితమన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నర్రా శ్రీను పాల్గొన్నారు.

శ్రీశాంతి కృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయికి ధార్మిక రత్న పురస్కారాన్ని అందజేశారు. ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌, ఆనంద్‌ సాయి ఎప్పట్నుంచో మంచి స్నేహితులు. ఈ రకంగా తన ఫ్రెండ్‌షిప్‌ని చాటుకున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?