
బిగ్‌బాస్4, 40వ రోజు లేడీ కంటెస్టెంట్ల నైట్ పార్టీ విశేషంగా ఆకట్టుకుంది. ఆద్యంతం రక్తికట్టింది. అందరిచేత నవ్వులు పూయించింది. కానీ ఇందులో అభిజిత్, అమ్మ రాజశేఖర్, సోహైల్, అఖిల్ బకరా అయ్యారు.
అమ్మాయిలకు నైట్‌ఔట్ పార్టీ చేసుకునే అవకాశం ఇచ్చారు బిగ్‌బాస్. దీనిలో అభిజిత్‌ని అమ్మాయిలు ఇంటర్వ్యూ చేశారు. అందరి అందాలను పొడిగాడు. తనకు నచ్చిన అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ చెప్పాడు. క్లీయర్ డిసీషన్ మేకింగ్, వాస్తవాలను తీసుకోవాలన్నారు. ఎవరితో డేటింగ్ వెళ్తావని అరియానా అడగ్గా, ఆమెతోనే వెళతా అన్నాడు. అమ్మ రాజశేఖర్‌ని అమ్మాయిలా నడిపించారు. సాంగ్‌కి స్టెప్పులేయించారు. ఆయన బాగానే ఆటపట్టించారు.
లుంగీతో వచ్చిన సోహైల్‌ని లేడీ కంటెస్టెంట్స్ విభిన్నంగా ఇంటర్వ్యూ చేశారు. అయితే మొదట సోహైల్ తాగుబోతులా ప్రవర్తించాడు. అదే సమయంలో అరియానాని పొగడ్తలో ముంచెత్తాడు. అయితే సోహైల్ వారి గురించి చెప్పమన్నాడు కామెంట్ చేయడంతో అందరు కలిసి సోహైల్‌ని పిల్లోస్‌తో కొట్టాడు. హారిక, అరియానా, దివి కలిసి సోహైల్ లుంగీని పీకారు. కాసేపు చుక్కలు చూపించారు. లుంగీ డాన్స్ వేయించారు. సోహైల్ బయటకు వెళితే కథ వేరుంటుందని పోజులు కొట్టినా. మొత్తంగా అమ్మాయిలాగా క్యాట్ వాక్ చేయించారు.
తర్వాత అఖిల్‌ని హారిక, అరియానా బాగా ఆడుకున్నారు. మొదట పొద్దున్నే లేచిన భార్యలాగా చేయాలన్నారు. అఖిల్‌చేత ముగ్గు వేయించారు. ఆ టైమ్‌లో హారిక వచ్చి నాతో వస్తావా? అంటే మా వారున్నారని అఖిల్ చెప్పగా, ఆయన లేకపోతే ఓకేనా అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత అరియానా సైతం తన దైన స్టయిల్‌లో అఖిల్‌ని ఓ ఆట ఆడుకుంది. ఇక అందరు కలిసి నైట్ పార్టీలో సాంగ్ లకు స్టెప్పులేశారు. ఒకరికొకరు రెచ్చిపోయారు.
రాత్రి మోనాల్, అవినాష్ కలిసి ` ఓ ప్రియా ప్రియా.. ` అంటూ పబ్ డాన్స్ చేశారు. ఫీల్ అద్భుతంగా ఉందంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. ఇంతలో అఖిల్ హౌజ్ నుంచి వీరున్న చోటుకి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరం.