డిజాస్టర్ ఫ్రైడే... నానికి కలిసొచ్చేలా ఉందే!

Published : Apr 08, 2023, 03:09 PM ISTUpdated : Apr 08, 2023, 03:15 PM IST
డిజాస్టర్ ఫ్రైడే... నానికి కలిసొచ్చేలా ఉందే!

సారాంశం

ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇది నాని దసరా మూవీకి కలిసొచ్చేలా ఉంది.   

రెండు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఈ శుక్రవారం విడుదలయ్యాయి. హీరో రవితేజ రావణాసురుడు చిత్రంతో వచ్చారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మీటర్ అంటూ ప్రేక్షకులను పలకరించారు. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన రావణాసుర నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కడక్కడ హైప్ ఇచ్చే సన్నివేశాలు తప్పితే సినిమాలో విషయం లేదని క్రిటిక్స్ తేల్చేశారు. ఓపెనింగ్స్ పర్లేదన్నట్లున్నా,  రెండో రోజే మూవీ చతికిలబడింది. బ్యాడ్ టాక్ బాగా దెబ్బతీసింది. 

రవితేజ గత చిత్రం ధమాకా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే రావణాసుర కంటే కొంచెం మెరుగైన రివ్యూలు పడ్డాయి. శ్రీలీల గ్లామర్, భీమ్స్ మ్యూజిక్ ప్లస్ అయ్యాయి. పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు బెటర్ సీజన్లో విడుదల కావడం కలిసొచ్చింది. సూపర్ హిట్ కొట్టింది. రావణాసుర విషయంలో ఈ మ్యాజిక్ రిపీట్ అయ్యే సూచనలు కనబడటం లేదు. 

ఇక కిరణ్ అబ్బవరం నేల విడిచి సాము చేయాలని చూసి బొక్కా బోర్లా పడ్డాడు. తనకు సెట్ అయ్యే జోనర్స్ వదిలేసి అప్పుడే మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి దెబ్బైపోయాడు. మీటర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మీటర్ లో చెప్పుకోవడానికి కొంచెం మేటర్ కూడా లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంట్ చేయడంతో మూవీ మీద హైప్ ఏర్పడింది. ఫలితం మాత్రం బెడిసి కొట్టింది.

రావణాసుర, మీటర్ నెగిటివ్ టాక్ తెచ్చుకోగా... హీరో నానికి కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దసరా విడుదలై ఒక వారమే అవుతుంది. రెండో వారం కూడా ఆడియన్స్ కి దసరా బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం కలదు. దీంతో దసరా మరింత మెరుగైన వసూళ్లు రాబట్టే ఆస్కారం ఉంది. వంద కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ దసరా ఏపీలో కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని సమాచారం. ఓ మంచి అవకాశం దసరా చిత్రానికి దక్కగా... ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..