
ఎపిసోడ్ ప్రారంభంలో చిత్రని నేను బాగా చూసుకుంటాను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నన్ను నమ్మండి అని వసంత్ అంటాడు. అప్పుడు యష్ మీ మాట మీద మాకు నమ్మకం ఉన్నది అత్తయ్య ఈసారికి మమ్మల్ని నమ్మండి అని అనగా, ఆ రిజిస్టర్ మ్యారేజ్ తప్పి మంచి పని అయింది ఇప్పుడు వేదమంత్రాలతో ఘనంగా పెళ్లి చేస్తాము అని అంటుంది సులోచన.
అప్పుడు సులోచన భర్త మళ్లీ మనం రెండోసారి వియ్యంకులం కాబోతున్నాము బావగారు అని అంటాడు. ఇప్పుడు ఘనంగా హోలీ పండుగ చేసుకుందాము అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో ఖుషి అందరికీ హోలీ రంగులు పూస్తూ ఉంటుంది. ఇంతలో చిత్ర, వసంత్ ఒకరికొకరు హోలీ రంగులు పూసుకుంటూ మన జీవితాలు ఎప్పుడూ ఇలాగే రంగుల మయంగా ఉండాలి ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
పెళ్లయిన తర్వాత కూడా ఎటువంటి లోటు రాకూడదు అని చిత్ర అంటే నేను నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా పువ్వులో పెట్టి చూసుకుంటాను. ప్రతిరోజు పండగలాగే చేస్తాను అని మాట ఇస్తాడు వసంత్. మరోవైపు వేద వాళ్ళ అక్క బావలు కూడా ఒకరికి ఒకరు హోలీ జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో ఖుషి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ రంగులు పూస్తుంది. మీ అమ్మ ఎక్కడ అని వాళ్ళు అడగగా ఇదిగో అని చెప్పి వేద వైపు చూపిస్తుంది.
ఇంతలో వేద అక్కడికి వచ్చి ఖుషి ని హత్తుకుంటుంది. హ్యాపీ హోలీ అమ్మ అని ఖుషి అనగా నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడూ నాకు పండగే. నువ్వు అమ్మా అని పిలవడమే నాకు పెద్ద పండగ అని మనసులో అనుకోని ఖుషిని వెళ్లి హత్తుకొని గాల్లో ఎగురేస్తుంది వేద. ఇంతలో వాళ్ళ అక్క బావలు వచ్చి రంగులు పూస్తారు. ఎందుకింత లేట్ అయింది అని వాళ్ళ బావగారు అనగా ఉన్నారు కదా నా శ్రీవారు అన్ని పనులు నేనే చేసి పెట్టాలి.
బ్రష్ నుంచి టవల్ వరకు అన్నీ నేనే ఇవ్వాలి.. అన్ని పనులు సద్ది పెట్టేసరికి ఇంత సమయం అయింది అని వేద అంటుంది. నేను ఎంత మంచి వాడిని అని వాళ్ళ బావగారు అనుకుంటారు. మిమ్మల్ని మీరు పొగుడుకోవటం ఆపండి అని సుహాసిని అంటుంది. మరోవైపు యష్ రత్నం ఆపి ఈరోజు హోలీ కదరా వెళ్లి కిందన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకో అంటాడు.
నాకు హోలీ అంటే ఎలర్జీ అని తెలుసు కదా. అయినా ఒక్కరి చేత కూడా రంగు వేయించుకోకుండా తిరిగి వస్తాను అని అంటాడు. వాళ్ల మధ్య నువ్వు రంగులు పడకుండా తిరిగి వస్తావంటే నాకు నమ్మకం లేదు అని వాళ్ళ నాన్న అంటాడు. బెస్ట్ సీఈవో ఇక్కడ ఎలా వెళ్లానో అలాగే తిరిగి వస్తాను ఒక్క చుక్క రంగు కూడా నా షర్ట్ మీద పడదు అని అనుకుంటాడు యష్.
మరోవైపు వేద వాళ్ళ బావగారు వేద దగ్గరికి వచ్చి బెస్ట్ హస్బెండ్ ఎక్కడ అని అంటాడు. ఎవరు బెస్ట్ హస్బెండ్ మీరా అని అనగా యశోదర్ ఎక్కడ ఉన్నారు మొన్న నా దగ్గరికి వచ్చి బెస్ట్ హస్బెండ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారు అని అంటాడు. ఆయన నిజంగా అలా అడిగారా అని వేద అడుగుతుంది. నువ్వు ఖుషి కి తల్లి కావడం కోసం ఆయనకి భార్యవయ్యావు.
కానీ యష్ నీకోసం నీ భర్త అవుతున్నాడు మీ ఇద్దరి మధ్య దూరం దగ్గర అవుతుంది అని అనగా నాకు అర్థం అవుతుంది అంటుంది. ఇప్పుడిప్పుడే ఆయన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను.. ఆయన కూడా నా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు అని గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఈ మిస్సెస్ న్యూసెన్స్ మిస్టర్ అరోగెంట్ ని తన మనసులోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది త్వరగా రండి అని అనుకుంటుంది వేద.
మరోవైపు మాళవిక, అభిమన్యు దగ్గరకు వెళ్లి రంగులు జల్లుతూ ఉండగా అభిమన్యు ఆపి మా అక్క మీ తరఫున ఎవరైనా ఉంటే గాని మనకి పెళ్లి చేయను అన్నది. నువ్వు నిన్న నీ తమ్ముడు రిజిస్టర్ మ్యారేజ్ ని చెడగొట్టావు. ఇప్పుడు వాళ్లంతా ఆనందంగా హోలీ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని నాకు ఆరాటం గా ఉంది.
ప్రతి సంవత్సరం హోలీ వస్తుంది కానీ మన పెళ్లి కోసం ఆలోచించడం లేదా పెళ్లయిన తర్వాత ప్రతిరోజూ హోలీయే కదా. దాని కోసం నువ్వు మాస్టర్ ప్లాన్ వేయాలి ఇప్పుడే బయలుదేరు అని చేతిలో రివాల్వర్ పెట్టి వీర తిలకం పెడుతున్నాను అని నుదుటిమీద ఎర్ర రంగుతో బొట్టు పెట్టి ఇంక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఈరోజే వెళ్లి చేసుకొని రా అని పంపుతాడు.
మరోవైపు విన్ని, వేద దగ్గరికి వచ్చి హోలీ రంగులు జల్లుతాడు ఇంతలో వసంత్, చిత్రలు కూడా అక్కడికి వస్తారు. బావ గారు ఎక్కడ అని చిత్ర అడగగా మా నాన్న గురించేనా మీరు మాట్లాడుతున్నారు. మా నాన్నకి హోలీ అంటే అస్సలు నచ్చదు చిరాకు అని అంటుంది ఖుషి. అవును యష్ కి హోలీ పడదు అని వసంత్ అనగా అలా ఎలా వదిలేస్తాను ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు నేను వచ్చాను.
ఇప్పుడు లెక్కలు మారాలి ఎలాగైనా రంగులు పడేటట్టు చేస్తాను అని అంటుంది వేద. అంత తేలికేం కాదు అని అంటాడు వసంత్. ఇంతలో యష్ అక్కడికి వస్తాడు. ఎవరో రంగులు వేస్తూ ఉండగా కోపంగా చూసి ఆపమని చెప్తాడు. అదే విధంగా విన్ని కూడా రంగులు పూయడానికి చూస్తాడు. కానీ అతడిని ఆగమని చెప్పి నాకు ఈ కలర్స్ అంటే నచ్చవు అని అంటాడు.తర్వాయి భాగంలో యష్, వేదలు ఇద్దరూ ఒకరి మీద ఒకరు రంగులు పూసుకుంటూ ఉంటారు. ఇంతలో మాళవిక రివాల్వర్ పట్టుకొని అక్కడికి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.