మోనాల్‌ కోసం అభి, అఖిల్‌ పోటీ.. లవ్‌ స్టోరీ మళ్లీ మొదలు కానుందా?

Published : Dec 14, 2020, 07:38 AM IST
మోనాల్‌ కోసం అభి, అఖిల్‌ పోటీ.. లవ్‌ స్టోరీ మళ్లీ మొదలు కానుందా?

సారాంశం

అఖిల్‌ పరిస్థితి అర్థం చేసుకున్న మోనాల్‌.. కన్నీళ్లతో ఆయనకు పువ్విచ్చింది. స్టేజ్‌పైకి వచ్చి టైటిల్‌ గెలవాలంటే మార్చుకోవాల్సిన లక్షణాలు తెలిపింది మోనాల్‌. అభిజిత్‌ గేమ్‌ బాగా ఆడుతున్నాడని, గుడ్‌ పర్సన్‌ అని తెలిపింది. అయితే తన ప్రియుడు అఖిల్‌తో మాట్లాడమని చెప్పింది. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో 14వ వారం మోనాల్‌ గజ్జర్‌ ఎలిమినేట్‌ అయ్యింది. దీంతో అనేక విమర్శలకు పుల్‌స్టాప్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యిందనే విషయం తెలిసి ఆమె హౌజ్‌ ప్రియుడు అఖిల్‌ షాక్‌కి గురయ్యాడు. ఆయన నిజంగానే సైలెంట్‌ అయిపోయాడు. అంతా అరియానా ఎలిమినేట్‌ అవుతుందని భావించారు. కానీ ఊహించని విధంగా మోనాల్‌ ఎలిమినేట్‌ కావడంతో అఖిల్‌తోపాటు సోహైల్‌ కి కూడా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. అఖిల్‌ నోరు మూగబోయింది. ఏం మాట్లాడాలో అర్థం కానీ పరిస్థితిలో ఉండిపోయాడు. 

అఖిల్‌ పరిస్థితి అర్థం చేసుకున్న మోనాల్‌.. కన్నీళ్లతో ఆయనకు పువ్విచ్చింది. స్టేజ్‌పైకి వచ్చి టైటిల్‌ గెలవాలంటే మార్చుకోవాల్సిన లక్షణాలు తెలిపింది మోనాల్‌. అభిజిత్‌ గేమ్‌ బాగా ఆడుతున్నాడని, గుడ్‌ పర్సన్‌ అని తెలిపింది. అయితే తన ప్రియుడు అఖిల్‌తో మాట్లాడమని చెప్పింది. అందరితో ఫ్రీగా మాట్లాడమని, నేను హౌజ్‌లో లేకపోతే మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యేవారని అన్నావు, ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని తెలిపింది. అయితే తాను అలా అనలేదని, బాధపెట్టి ఉంటే క్షమించమని అన్నాడు అభిజిత్‌. బిగ్‌బాస్‌ పూర్తయ్యాక గుజరాత్‌ వచ్చి కలుస్తా అన్నాడు. 

ఇక అఖిల్‌ గురించి మోనాల్‌ స్పందిస్తూ, ఈ మధ్య తనని పట్టించుకోవడం లేదని, స్టేజ్‌పైకి వచ్చే ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పింది. ఆమె కోసం నాగ్‌ ఓ పాట పాడమని చెప్పగా, `ఉండిపోరాదే..` అనే సాంగ్‌ పాడి ఆమెకి కన్నీళ్లు తెప్పించాడు అఖిల్‌. నిన్ను బాధపెట్టినందుకు సారీ అని, బిగ్‌ బాస్‌ పూర్తయ్యాక వచ్చి కలుస్తా అన్నాడు. అయితే గొడవ పెట్టుకునేందుకు రావద్దని చెప్పింది. ఇలా ఓ వైపు అభిజిత్‌, మరోవైపు అఖిల్‌ ఇద్దరూ మోనాల్‌నికలుస్తా అంటున్నారు. మరి బిగ్‌బాస్‌ ఇంటి పోరు బయట కూడా కంటిన్యూ చేస్తారా? ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ బయట కూడా రన్‌ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్