Ennenno Janmala Bandham: చిత్ర ఫోన్ పగలగొట్టిన అభి.. నర్స్ కి ముద్దు పెట్టిన యష్?

Published : Mar 02, 2023, 10:29 AM IST
Ennenno Janmala Bandham: చిత్ర ఫోన్ పగలగొట్టిన అభి.. నర్స్ కి ముద్దు పెట్టిన యష్?

సారాంశం

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు మార్చి 2వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో వేదా విని పొగుడుతూ ఉండగా అప్పుడు వేదకి పొలమారడంతో వెంటనే విన్ని యష్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వేళ్ళకి నీళ్లు తాగిస్తూ ఉంటాడు. అది చూసి యష్ ఆశ్చర్యపోతాడు. బెస్ట్ హస్బెండ్ చేయకుండా ఉండడం కోసం ఈ బఫూన్ గాడు కుట్ర చేస్తున్నాడు రేయ్ విన్నీ గాని సంగతి చెప్తాను అని కోపంగా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు యష్. మరొకవైపు చిత్ర, అభిమన్యు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎందుకు పిలిచారు సార్ అనడంతో నిన్ను చూడగానే నిన్ను చూసి వచ్చిన పని ఏంటో మర్చిపోయాను అనడంతో అప్పుడు చిత్ర నేను వెళ్తున్నాను సార్ అనడంతో లేదు ఒక్క నిమిషం ఆగు ఆ ఫైల్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చెయ్ అని అంటాడు అభిమన్యు.

అప్పుడు చిత్ర ఫైల్ చూస్తుండగా కావాలనే అభిమన్యు చిత్ర ఫోన్ ని విసిరేయడంతో ఫోను పగిలిపోతుంది. అప్పుడు చిత్ర మనసులో నేను వీడియో తీసినది ఈ నీచుడు చూశాడు అనుకుంటా అందుకే ఫోన్ పగలగొట్టాడు అనుకుంటూ ఉంటుంది. డోంట్ వర్రీ నీకు అంతకంటే కాస్ట్లీ మంచి మొబైల్ తీసిస్తాను అనడంతో మీ దగ్గర తీసుకోవాల్సిన అంత కర్మ నాకు పట్టలేదు అని చిత్ర కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు యశోదర్ హాస్పిటల్ బయట నిలబడే పదేపదే విన్నీ వేద మాట్లాడిన మాటలు ఆ సంఘటనలు గుర్తుతెచ్చుకొని కుళ్లు కుంటూ ఉంటాడు.

ప్రతి ఒక్క విషయంలో పానకంలో పుడకలాగా వస్తూనే ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బెస్ట్ హస్బెండ్ అని ఎలా అనిపించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు యశోదర్. అప్పుడు బెస్ట్ హస్బెండ్ అని ఎలా అనిపించుకోవాలి అని ఫోన్లో టైప్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఫోన్లో ఆ టిప్స్ ని చదువుకుంటూ ఉంటాడు. అందులో చివరి పాయింట్ మంచి హస్బెండ్ అవ్వాలి అంటే కిస్ చేయాలి అనడంతో ఇదేంటిది పిచ్చి లాజిక్ అని అనుకుంటూ ఉంటాడు యష్. అయిన కిష్ చేస్తే మంచి హస్బెండ్ అయిపోతాడా అనుకుంటూ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

అప్పుడు ఎలా అయినా వేదకి ముద్దు పెట్టి వాడి ఓవర్ యాక్షన్ కి చెక్ పెట్టాలి అనుకుంటూ లోపలికి వెళ్తాడు యశోదర్. ఇదే మంచి అవకాశం అని అనుకుంటూ ఉండగా అప్పుడు వేద బెడ్ పై లేకపోవడంతో ఎక్కడికి వెళ్లింది అని రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు వాష్ రూమ్ లో ఎవరో చేతులు కడుక్కుంటున్నట్టుగా శబ్దం రావడంతో వేద అక్కడికి వెళ్ళింది అనుకొని సంతోష పడుతూ ఉంటాడు యశోదర్. ఏంటిది ఒక ముద్దు కోసం ఇంతలా టెన్షన్ పడాలా ఓన్లీ కిస్ మాత్రమే కదా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు యశోదర్. అప్పుడు నర్స్ కి ముద్దు పెట్టేసి కిస్ పెట్టేసాను వరల్డ్ బెస్ట్ హస్బెండ్ నేనే అని సంతోష పడుతూ ఉండగా ఆమె షాక్ అవుతుంది.

ఇప్పుడు యశోదర్ ఆమెను చూసి ఒకసారిగా షాక్ అవుతాడు. అప్పుడు సిస్టర్ ఏమయింది అనడంతో ఆమె షాక్ లో నుంచి బయటకు వచ్చి తనని ఏం చేయొద్దండి సార్ ప్లీజ్ సార్ అంటూ గట్టిగా యశోదర్ ఏదో చేస్తున్నట్టుగా అరుస్తూ ఉండడంతో ఇంతలో అక్కడికి వేద విన్ని ఇద్దరూ వస్తారు. అప్పుడు యష్ కి పోయాను కదా ఎలాగో అలా నేనే మేనేజ్ చేయాలి అనుకుంటూ రివర్స్లో వేద మీద సీరియస్ అవుతాడు. ఎక్కడికి వెళ్లావు అనడంతో ఫార్మాలిటీస్ ఫిలప్ చేయడానికి వెళ్లాను అని అంటుంది వేద. అయినా సిస్టర్ ఎందుకు అరుస్తోంది అనడంతో అప్పుడు సిస్టర్ మేడం మీ ఆయన చూడ్డానికి జెంటిల్మెన్ లా ఉన్నారు కానీ అని చెప్పబోతుండగా ఏయ్ అంటూ సిస్టర్ మీదకు వెళ్తాడు యశోదర్.

ఏం చేశారు అని వేద అడగగా ఏం లేదు ఏంటి సార్ ఏమీ లేదు అంటున్నారు మీరు చేసింది మామూలు పనా అని అంటుంది సిస్టర్. అంతా నీ వల్లే నువ్వు అనుకో నేను ఆమెను అని చెప్పడానికి యశోదర్ సిగ్గుపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది చెప్పు సిస్టర్ అనగా మీ ఆయన నన్ను కిస్ చేశారు అనడంతో వేద విన్ని ఇద్దరూ షాక్ అవుతారు. అప్పుడు వేద,యశోదర్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు సిస్టర్ పరాయి మగాడు పరాయి స్త్రీకి ముద్దు పెడతారా ఎంత ధైర్యం సార్ మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనడంతో ఒక్క నిమిషం సిస్టర్ నేను చెప్పేది వినండి అని అంటాడు. అప్పుడు వేద సిస్టర్ మా ఆయన ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా ఏదో పొరపాటు జరిగింది మా ఆయన తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను అని అంటుంది వేద.

 ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అనడంతో సరే మేడం అని అంటుంది నర్స్. అప్పుడు వేద యశోదర్ వైపు అలాగే చూస్తూ ఉండగా యశోదర్ మాట్లాడడానికి కూడా టెన్షన్ పడుతూ మొహమాటపడుతూ ఉంటాడు. డిస్చార్జ్ అయ్యాం కదా నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను అని తప్పించుకొని వెళ్ళిపోతాడు యశోదర్. మరొకవైపు మాళవిక పార్టీ ముగించుకుని ఇంటికి రావడంతో ఆగు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇది ఇల్లు అనుకున్నావా పబ్బనుకున్నావా అనడంతో అది అడగడానికి నువ్వు ఎవరు అని అంటుంది మాళవిక. మేము ఆరేళ్ళుగా రిలేషన్ షిప్ లో ఉన్నాము అనగా సిగ్గుండాలి ఆ మాట అనడానికి అని భ్రమరాంబిక అనడంతో ఆ మాట మీ తమ్ముడికి చెప్పండి అంటుంది మాళవిక.

ఇంతలో అభి అక్కడికి వచ్చి ఏంటి గొడవ అనగా చూడు అభి మీ అక్క ఎక్కడ ఎక్కడో తిరగొచ్చావు అని గొడవ పెట్టుకుంది అనడంతో మాళవిక ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు ఇద్దరు కలిసే వెళ్ళాము కలిసే వచ్చాము అని అంటారు అభి. అప్పుడు చూడక్క నువ్వు అనవసరంగా కోపగించుకోకు మాళవిక విషయం గురించి నీకు అనవసరం నువ్వు ఇంటికి గెస్ట్ గా మాత్రమే గెస్ట్ లాగే ఉండు అని అనడంతో బ్రమరాంబిక షాక్ అవుతుంది. అప్పుడు అభికి సరికొత్త నాటకం మొదలు పెట్టడంతో అది నిజమని నమ్ముతూ ఉంటుంది మాళవిక. అప్పుడు మాళవిక అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఏంటి అక్క నాలో మార్పు చూసి నువ్వు కూడా ఆశ్చర్యపోయావా అనడంతో అదేంటి అభి అనగా తనతో నాకు బోర్ కొట్టేసింది అక్క తనతో రిలేషన్ షిప్ కొనసాగించాలని లేదు చాలా బోరింగ్ గా ఉంది అని అంటాడు అభి.

వెంటనే నీ నిర్ణయం మార్చుకొని ఈ మిడిల్ క్లాస్ మాళవిక ను నీ లైఫ్ లో నుంచి పక్కకు పాడేయడంతో సరే అక్క అని అంటాడు అభి. మరొకవైపు వేద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా మరొకవైపు యశోదర్ జరిగిన విషయాన్ని తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సులోచన మీకు నవ్వుకోడానికి నా అల్లుడు తప్పితే ఎవరూ దొరకలేదా అనగా అప్పుడు చిత్ర యష్ ఇప్పుడు తెలిసింది బావగారు అక్క నీకు కిస్ చేయబోయి నీకు కిస్ చేసాడు ఆనంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు యష్ పేద పరాయి అమ్మాయి కాదు నా భార్య కదా మరి ఎందుకు ఇంతలా నేను టెన్షన్ పడుతున్నాను అనుకుంటూ ఉంటాడు..

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు