
అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. హీరో అడివి శేష్ ఆమెను టాలీవుడ్ కి తీసుకొచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటించారు. గూఢచారి సూపర్ హిట్ కొట్టింది. అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం మేజర్ లో మరో ఛాన్స్ ఇచ్చారు. బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ విజయం సాధించింది.
శోభిత పలు భాషల్లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్ అయ్యారు. అలాగే వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. హాలీవుడ్ ప్రమోషన్ కూడా దక్కించుకున్న శోభిత కెరీర్ బిగినింగ్ లో ఎదురైన అవమానాలు గుర్తు చేసుకున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె ఒక షాకింగ్ సంఘటన అభిమానులతో చెప్పుకున్నారు. ఓ షాంపూ యాడ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను కూడా హాజరయ్యాను. నన్ను చూసి... నువ్వు కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు. నువ్వు అందంగా లేవు అన్నారు. అవును నేను అందంగా లేనని చెప్పి అక్కడ నుండి వచ్చేశాను. అప్పుడు నా వయసు 20 ఏళ్ళు. కొన్నేళ్ల తర్వాత అదే షాంపూ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేశానంటూ శోభిత చెప్పుకొచ్చారు.
శోభిత గత ఏడాది పొన్నియిన్ సెల్వన్ మూవీలో కీలక రోల్ చేశారు. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2తో పాటు ఇంగ్లీష్ మూవీ మంకీ మాన్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.ఇటీవల నాగ చైతన్యతో లవ్ ఎఫైర్ అంటూ శోభిత వార్తల్లో నిలిచారు. సమంతకు దూరమయ్యాక చైతు శోభితకు దగ్గరయ్యారనే ప్రచారం జరిగింది. తరచుగా కలుసుకుంటున్న ఈ జంట త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ప్రముఖంగా వినిపించింది. ఈ వార్తలను నాగ చైతన్య టీం ఖండించారు. శోభిత సైతం ఇవన్నీ నిరాధార కథానాలంటూ కొట్టిపారేశారు.