
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి సందడి చేశారు. అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు కారణం ఏంటో తెలియదు కాని.. హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ కు.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. పికప్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకు అల్లు అర్జున్ కారు కూడా పంపించారు. దాంతో వీరిద్దరు కలవడానికి కారణం ఏంటబ్బా అని అంతా ఆలోచనలో పనడ్డారు.
బ్లాక్ టీ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్ లో ఉన్న అమీర్ ఖాన్ ఎయిర్ పోర్టు వద్ద కనిపించగానే అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. టాలీవుడ్ టాక్ ప్రకారం అమీర్‌ఖాన్ ఎయిర్‌పోర్టు నుంచి అల్లు అర్జున్ కారులో సరాసరి.. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లాడు . అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలయిక వెనుకు కారణం ఏంటీ అనేది మాత్రం తెలియలేదు. వీరి సమావేశమవడం వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా..? అనేది టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అయితే కొంత మంది ఈఇద్దరు క్యాజువల్‌గానే కలిశారంటున్నారు.
అయితే అమీర్ ఖాన్ హైదరాబాద్ రావడానికి మరో కారణం కనిపిస్తుంది. హిందీలో ఎక్కువ సినిమాలు నిర్మించిన మధు మంతెన తండ్రి హైదరాబాద్ లో మరణించారు. మధు మంతెన హిందీలో చాలా సినిమాలు నిర్మించారు. అమీర్ ఖాన్ తో గజనీతో పాటు మరికొన్ని సినిమాలు నిర్మించారు. అయితే ఆయన్ను పలకరించడానికి అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారేమో అని అనుకుంటున్నారు. మరి అసలు నిజం ఏంటో తెలియదు కాని. అమీర్ ఖాన్ అల్లు అర్జున్ ఇంట్లో సందడి చేయడం మాత్రం నిజం
అమీర్ ఖాన్ గతేడాది లాల్ సింగ్ చడ్డా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఆ తర్వాత మరే కొత్త సినిమా ప్రకటించలేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప.. ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప.. ది రూల్ 2024 స్టార్టింగ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా అల్లు అర్జున్ ఇటీవలే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో కొత్త సినిమా కూడా ప్రకటించేశాడు.