బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన లగాన్ నటి, కంటతడి పెట్టించేలా ఆమె ఆవేదన.. అమీర్ భాయ్ కి తెలియదు అంటూ..

pratap reddy   | Asianet News
Published : Sep 25, 2021, 10:33 AM IST
బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన లగాన్ నటి, కంటతడి పెట్టించేలా ఆమె ఆవేదన.. అమీర్ భాయ్ కి తెలియదు అంటూ..

సారాంశం

సినిమా అనేది రంగుల ప్రపంచం. పైకి రంగులు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ రంగుల వెనుక ఉన్న విషాదాలు బయటకు వచ్చేది చాలా తక్కువ. అమీర్ ఖాన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో లగాన్ ఒకటి. 

సినిమా అనేది రంగుల ప్రపంచం. పైకి రంగులు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ రంగుల వెనుక ఉన్న విషాదాలు బయటకు వచ్చేది చాలా తక్కువ. అమీర్ ఖాన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో లగాన్ ఒకటి. 2001లో విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. చిత్ర పరిశ్రమలో క్రేజ్ ఉన్న ఆర్టిస్టులకి ఆదాయం బాగానే ఉంటుంది. 

కానీ అప్పుడప్పుడూ అవకాశాలు అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ లకు ఆర్థిక సమస్యలు తప్పవు. పర్వీనా అనే నటి లగాన్ తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే విధంగా ఉంది. 

ఆర్థిక సమస్యలకి తోడు ఆమె ఆరోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. దీనితో ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియా ముందు అమీర్ ఖాన్ కి మొర పెట్టుకుంది. చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా అమీర్ ఖాన్ చొరవ తీసుకుని తనకు కాస్టింగ్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇప్పించాలని కోరుతోంది. 

పర్వీనా 2020లో బ్రెయిన్ స్ట్రోక్ కి గురైంది. అప్పుడు ఆమె అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో వైద్య ఖర్చులు ఎక్కువయ్యాయి. ఫ్యామిలీ, స్నేహితులు సహాయం చేసినా ఆ డబ్బు సరిపోలేదు. దీనితో సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రంగంలోకి దిగి అక్షయ్ కుమార్, సోనూసూద్ లాంటి సెలబ్రిటీల ద్వారా ఆమె వైద్యానికి సాయం అందించారు. 

ఆ డబ్బు కూడా ఆమె చికిత్సకే సరిపోయింది. ఇప్పుడు పర్వీనా ఆరోగ్యం కాస్త కుదుట పడింది. కానీ ఇకపై ఆమె నటిగా సినిమాల్లో నటించలేరు. ఆర్థరైటిస్ కారణంగా ఆమె చేతులు బలహీనంగా మారాయి. దీనితో  పర్వీనా తన ఫ్యామిలీకి భారం కాలేక తీవ్ర వేదన అనుభవిస్తోంది. తనని తాను పోషించుకునేలా చిత్ర పరిశ్రమలోనే ఎవరైనా ఉద్యోగం ఇస్తే బావుంటుందని కోరుతోంది. 

లగాన్ చిత్రంలో ఆమె అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. నా అనారోగ్యం గురించి, ఆర్థిక సమస్యల గురించి అమీర్ భాయ్ కే తెలియదు. తెలిస్తే ఆయన తప్పకుండా నాకు ఓ దారి చూపిస్తారు. దయచేసి నా గురించి ఎవరైనా అమీర్ భాయ్ కి తెలియజేయండి అని పర్వీనా తనన సంప్రదించిన మీడియాని కోరింది. కాస్టింగ్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇస్తే చేయగలనని పర్వీనా అంటోంది. 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌