`రామారావు ఆన్ డ్యూటీ` కథకు మూలం విజయ్ సినిమానా?

By Surya Prakash  |  First Published Sep 25, 2021, 8:54 AM IST

మాస్ మహారాజా రవితేజ(raviteja) 68 చిత్రం శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. “రామారావు ఆన్ డ్యూటీ”(ramarao on duty) అనే టైటిల్ తో రూపొందుతున్న  ఈ సినిమా విజయ్ హీరోగా వచ్చిన ఓ సూపర్ హిట్ మూవీకి దగ్గర పోలికలు ఉన్నాయంటున్నారు.


క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మార్కెట్‌లో మాస్ మహారాజ రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. ఆయన డేట్స్ కు డిమాండ్ ఏర్పడింది. క్రాక్ తర్వాత రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి మూవీ (Khiladi movie) చేస్తున్న రవితేజ.. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ తో మరో సినిమా చేస్తపన్నారు. ఈ సినిమాతో శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ చిత్రానికి సంభందించిన ఛాయిలు ఉండబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా ఏమిటి...

ఇండస్ట్రీ వర్గాల నుంచి  సమాచారం ప్రకారం ఇప్పుడు విజయ్ సూపర్ హిట్ సినిమా "పోలీసోడు" సినిమా ఫార్ములా రవి తేజ తదుపరి సినిమా "రామారావు ఆన్ డ్యూటీ" లో కూడా ఉపయోగించనున్నారట. ఈ సినిమాలో కూడా రవితేజ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ కి ఒక భార్య మరియు కొడుకు ఉంటారట. అతని కూతురుకు కొన్ని కారణాలతో దూరంగా ఉంటాడట. విజయ్  పోలీసోడు సినిమాలోని ఫ్యామిలీ, విలన్ ట్రాక్ లాంటిదే ఈ సినిమాలోనూ ఉండబోతోందంటున్నారు. గతంలోనూ పోలీసోడు సినిమాని రవితేజతో రీమేక్ అనుకున్నారు. కానీ అవ్వలేదు. ఇప్పుడు అదే ట్రాక్ ని కాస్త మార్చి, పోలీస్ పాత్రని ఎమ్మార్వో గా చేసి, రవితేజ ని చూపించబోతున్నారట. అలా యాక్షన్ తో  "రామారావు ఆన్ డ్యూటీ"  ఎమోషనల్ మిక్స్ అయ్యి నడుస్తుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది.

Latest Videos

ఇక క్రాక్  సినిమాలో రవితేజ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించగా, శృతిహాసన్ ఒక బిడ్డ తల్లిగా మరియు రవితేజ భార్య పాత్రలో చాలా బాగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా మారింది. ఇప్పుడు దాదాపు ఇలాంటి సెంటిమెంటే ఉండటంతో మరింత నమ్మకం పెరిగిందంటున్నారు.
 
ఈ సినిమాలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా.. రవితేజ సరసన మజిలీ మూవీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్  జంటగా నటిస్తోంది. ఆర్టీ టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రామా రావు ఆన్ డ్యూటీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచింది.
 

click me!