ఆ టైంలో చాలా సార్లు అబార్షన్ అయింది.. అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్

Published : Apr 19, 2024, 05:55 PM IST
ఆ టైంలో చాలా సార్లు అబార్షన్ అయింది.. అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్

సారాంశం

దాదాపు 15 ఏళ్లపాటు అన్యోన్యంగా జీవితం సాగించిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అమీర్ ఖాన్, కిరణ్ రావులు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

దాదాపు 15 ఏళ్లపాటు అన్యోన్యంగా జీవితం సాగించిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అమీర్ ఖాన్, కిరణ్ రావులు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ సంతానం.

కిరణ్ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అబార్షన్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పిల్లలు పొందాలని పెళ్లి తర్వాత చాలా ప్రయత్నించాం. ఒక పాప, బాబుని పొందడం ఇంత కష్టమా అనిపించింది. ఐదేళ్లలో నాకు చాలా సార్లు అబార్షన్ అయింది. అది నరకం. అబార్షన్ వల్ల నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా ఆజాద్ ని కన్నాను. చాలా సంతోషం అనిపించింది. 2011లో మాకు ఆజాద్ జన్మించాడు. పిల్లాడిని ప్రేమగా పెంచాలనే ఉద్దేశంతో పదేళ్లు సినిమాకి దూరంగా ఉన్నాను. అందుకు నాకేమి భాదగా లేదు. ఎందుకంటే జా జీవితంలో అవే ఉత్తమమైన రోజులు అంటూ కిరణ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

కిరణ్ రావు ఇటీవల లపతా లేడీస్ సినిమాతో దర్శకులరాలిగా రీ ఎంట్రీ ఇచ్చారు. కిరణ్ రావు, అమీర్ ఖాన్ విడిపోవడం వెనుక చాలా రూమర్స్ వినిపించాయి. ఓ యువ నటితో అమీర్ ఎఫైర్ కోనసాగిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌