బచ్చన్‌ సాబ్‌ ఆగయా..ఆకాష్‌పూరితో `జార్జిరెడ్డి` డైరెక్టర్‌ కొత్త సినిమా `చోర్‌ బజార్‌`..

Published : Jul 25, 2021, 10:13 AM ISTUpdated : Jul 25, 2021, 10:14 AM IST
బచ్చన్‌ సాబ్‌ ఆగయా..ఆకాష్‌పూరితో `జార్జిరెడ్డి` డైరెక్టర్‌ కొత్త సినిమా `చోర్‌ బజార్‌`..

సారాంశం

`జార్జిరెడ్డి` తర్వాత దర్శకుడు జీవన్‌రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తుండటం విశేషం. తాజా ఫస్ట్ లుక్‌,మోషన్‌ పోస్టర్‌లో ఆకాష్‌ పూరి యాక్షన్‌మూడ్‌లో ఉన్నారు.

ఆకాష్‌పూరి కొత్త సినిమాని ప్రకటించారు. `జార్జిరెడ్డి` దర్శకుడు జీవన్‌రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆకాష్‌ పూరి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. `జార్జిరెడ్డి` తర్వాత దర్శకుడు జీవన్‌రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తుండటం విశేషం. తాజా ఫస్ట్ లుక్‌,మోషన్‌ పోస్టర్‌లో ఆకాష్‌ పూరి యాక్షన్‌మూడ్‌లో ఉన్నారు. ఆయన ఓ చేతిలో తుపాకీ, మరో చేతిలో ఇనుప రాడ్‌ పట్టుకుని ఆంగ్రీలుక్లో ఉన్నారు. `బచ్చన్‌ సాబ్‌ ఆగయా` అనే ట్యాగ్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ఇందులో ఆకాష్‌ పూరి బచ్చన్‌ సాబ్‌ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మాస్‌ ఎలిమెంట్లతో ఈ చిత్రం రూపొందుతుందని తాజా పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్‌. రాజు నిర్మిస్తున్నారు. పూరీ తనయుడు ఆకాష్‌ పూరి `మెహబూబా` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన `రొమాంటిక్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించడం విశేషం. ఇక దర్శకుడు జీవన్‌రెడ్డి రూపొందించిన `జార్జిరెడ్డి` చిత్రం ఓయూ పూర్వ విద్యార్థి, విద్యార్థి నాయకులు జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్