బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ కారు ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌ అమ్మాయి కన్నుమూత..నటి పరిస్థితి విషమం

Published : Jul 25, 2021, 09:23 AM ISTUpdated : Jul 25, 2021, 09:39 AM IST
బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ కారు ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌ అమ్మాయి కన్నుమూత..నటి పరిస్థితి విషమం

సారాంశం

తమిళ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందారు.

తమిళ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందగా, యాషికా ఆనంద్‌తోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో శనివారం అర్థరాత్రి ఒకటిన్నసమయంలో చోటు చేసుకుంది.

 యాషికా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు రోడ్డు మలుపు ఉండటం కూడా ప్రమాదానికి కారణమంటున్నారు. డివైడర్‌కి బలంగా ఢీ కొనడంతో కారు పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. 

కారు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన వారిని చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. అందులో నటి యాషికా పరిస్థితి మరింత విషమంతా ఉందని సమాచారం. మృతి చెందిన వల్లిశెట్టి భవాని హైదరాబాద్‌ వాసిగా గుర్తించారు. ఆమె ఇటీవలే అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం.

ఢిల్లీకి చెందిన యాషిక మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. 2016లో జీవా సరసన `కావలై వెండమ్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. `చీకటి గదిలో చితక్కొట్టుడు`, `నోటా`, `అమ్మోరు తల్లి` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఐదు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు తమిళ బిగ్‌బాస్‌2, బిగ్‌బాస్‌3 సీజన్లలో పాల్గొని మరింత పాపులర్‌ అయ్యింది యాషికా ఆనంద్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా