తెలుగు సినిమా కొత్తదారులు వెతుక్కుంటోంది. నావెల్టీ పాయింట్స్ ని టచ్ చేస్తోంది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
తెలుగు సినిమా కొత్తదారులు వెతుక్కుంటోంది. నావెల్టీ పాయింట్స్ ని టచ్ చేస్తోంది. అందుకు నిదర్శనం గత కొంతకాలంగా వస్తున్న చిత్రాలే. అయితే అదే సమయంలో కొత్త పేరుతో చెత్త పోగవుతోంది. ఒకే బుర్రలో రెండు మెదడులు ఉంటే అనే ఆలోచనతో బుర్రకథ అనే చిత్రం మన ముందుకు వచ్చింది. పాయింట్ గా బాగున్న ఈ చిత్రం అదే స్దాయిలో ఆకట్టుకోగలిగిందా..అసలు రెండు బుర్రలు ఉండే వాడికి వచ్చే సమస్యలు ఏమిటి..ఆ బుర్రలో ఉన్న రెండు మెదళ్లేనా ఇంకైమానా ఉందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ ఏంటి..
రెండు మెదళ్లతో పుట్టిన అభిరామ్(ఆది సాయికుమార్) మొదటి నుంచీ రెండు రకాలుగా బిహేవ్ చేస్తూంటాడు. రెండు మెదళ్లు వ్యతిరేకంగా పనిచేస్తూండటంతో ..దాంతో తనకే కాక, తన చుట్టుప్రక్కల ఉన్నవాళ్లకీ చాలా సమస్యలు వస్తూంటాయి. ఏదైనా పెద్ద శబ్దం విన్నప్పుడు ఈ రెండు మొదళ్లూ అటుది,ఇటుది అటూ మారిపోతూంటుంది. ఆ మొదళ్లలో ఒకటి అభి, మరకొటి రామ్ అన్నమాట. దాంతో ఏ మెదడు ఎప్పుడు ఏక్టివ్ లో ఉంటుందో..ఏది డీఏక్టివేట్ అవుతుందో అభిరామ్ కు కూడా తెలియదు. ఈ క్రమంలో అభిరామ్ జీవితంలోకి లవర్ హ్యాపీ (మిస్త్రీ చక్రవర్తి), విలన్ గగన్ విహారి(అభిమన్యు సింగ్) ప్రవేశిస్తారు. వీళ్ల రాకతో అభిరామ్ కు రకరకాల సమస్యలు వస్తాయి. అలాగే వాళ్లకి అభిరామ్ తో ట్విస్ట్ లు పడుతూంటాయి. అప్పుడు ఏం జరిగింది. బుర్రలోని అభి,రామ్ మైండ్ లు ఎప్పటికైనా కలిసిపోయాయా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సియామీ కవలల్లా...
Stuck on You (2003) అని ఓ సినిమా వచ్చింది. అందులో ఇద్దరు సోదరలు..ఒకే శరీరం(సియామి కవలలు అన్నమాట). ఇద్దరు వ్యతిరేక మనస్తత్వం ఉన్నవాళ్లు. వాళ్లు ఎలా సర్వైవ్ అయ్యారు. వారి ప్రేమ కథలో వచ్చిన సమస్యలు ఏమిటి..చివరకు ఇద్దరూ ఒకే రకంగా ఆలోచించాలనే నిర్ణయానికి ఎలా వచ్చేరనే పాయింట్ ని డీల్ చేస్తూ సాగే కామెడీ. బుర్రకథ సినిమా చూస్తూంటే ఈ సినిమా గుర్తుకు వస్తుంది. అలాగని ఇదేదో దాని కాపీ అనికాదు. అలా బాగా స్క్రిప్ట్ చేసుకుని తెరకెక్కిస్తే ఇంకా బాగుండేదనిపిస్తుంది.
ఎక్కడ తేడా
ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఒకరు రౌడీ, మరకొరు పోలీస్ అయితే ...మణిరత్నం ఘర్షణ అవుతుంది. అలాగే ఇద్దరు కవలల్లో ఒకడు దొంగ, మరొకడు జెంటిల్ మెన్ అయితే అది హలో బ్రదర్ అవుతుంది. ఇప్పుడు ఒకే బుర్రలో రెండు మెదడులు అంటే అది బుర్ర కథ అవుతుంది. మిగతాదంతా సేమ్ సేట్ అన్నట్లుగా కథనం నడుస్తుంది. దాంతో స్టోరీలైన్ గా బాగున్నది కథా విస్తరణలో ఖర్చైపోయిందని అర్దమవుతుంది.
వాస్తవానికి ఒక సెల్లు..రెండు సిమ్ లు, ఒక మనిషి, రెండు మైండ్ లు అనే కాన్సెప్ట్ వింటానికి ఇంట్రస్టింగ్ గానే ఉంది. కానీ ఆ మైండ్ లు రెండూ.. ద్విపాత్రాభినయం సినిమాలోలాగ ఒకడు మంచోడు, మరొకడు చెడ్డోడు అన్నట్లు డిజైన్ చేసినప్పుడే ఇది రొటీన్ కథనానికి దారి తీసింది. దాంతో పాయింట్ నావల్టిగా అనిపించినా, సినిమా సిల్లీగా తయారైంది. సాధారణంగా రచయితలు ...దర్శకులుగా మారి సినిమా చేస్తే ఖచ్చితంగా మంచి కథ,కథనం ఎక్సపెక్ట్ చేస్తాం. అదే ఈ సినిమాలో మిస్సైంది.ఇక అభిమన్యుసింగ్ విలనిజం చాలా ప్యాసివ్ గా ఉంది. ఉండాలి కాబట్టి విలన్ ఈ సినిమాలో ఉన్నాడు అనిపించింది. కథపై విలన్ ఇంఫాక్ట్ కనిపించలేదు. రాజేంద్ర ప్రసాద్ నటన కూడా కాస్త ఎక్స టెంపోలోనే నడిచి విసిగించింది.
undefined
సాధారణంగా .. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోసం కథలో అక్కడక్కడా కామెడీ ట్రాక్ వస్తూంటాయి. (అవీ ఈ మధ్యన బాగా తగ్గాయి). ఇక్కడ కామెడీ ట్రాక్ లను కలిపేందుకు మధ్యలో అక్కడక్కడా కథ అనే ధ్రెడ్ ని కలిపినట్లు అనిపించింది.
టెక్నికల్ గా ...
డైరెక్టర్ రత్నబాబు సినిమాను తెరకెక్కించిన విధానం అద్బుతం కాదు కానీ బాగానే ఉంది. మంచి కథ పడితే దర్శకుడుగా రాణిస్తాడనిపించింది. ఇక సాయికార్తీక్ ఇచ్చిన పాటలు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాని బాలేదు. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ లో సినిమాకు కావాల్సిన విజన్ లేదు. జస్ట్ ఒకే అన్నట్లుగా సాగింది. పాటలుకు సరైన ప్లేస్ మెంట్ లేదు. కానీ రత్నబాబు బలమైన డైలాగులు మాత్రం బాగా పేలాయి. ఎడిటింగ్ సోసోగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ఫైనల్ థాట్..
స్టోరీ లైన్ లోనే కాదు స్టోరీలోనూ, స్క్రీన్ ప్లేలోనూ కొత్తదనం,నావెల్టీ ఉంటేనే అది బుర్రకు నచ్చే కథ.
Rating:2/5