ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Published : May 09, 2022, 08:01 AM IST
ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

సారాంశం

ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి వెడ్డింగ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యింది.

స్టార్‌ ఇమేజ్‌ అనే ట్రాప్‌లో పడకుండా నటుడిగా తనని తాను ఆవిష్కరించుకుంటూ రాణిస్తున్నారు ఆదిపినిశెట్టి(Aadhi Pinishetty). హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటిస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు. మొత్తంగా విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకుంటున్నారు. నటుడిగా బిజీగా ఉన్న ఆదిపినిశెట్టి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ(Nikki Galrani)తో ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 24న ఈ ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో మూడుముళ్లతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా వీరి మ్యారేజ్‌కి ముహూర్తం ఫిక్స్(Aadhi Pinishetty Nikki Galrani Wedding) అయినట్టు తెలుస్తుంది. మే 18న గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. చెన్నైలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ వివాహం చేసుకోబోతోన్నారు. ఎంగేజ్‌మెంట్‌ చాలా సింపుల్‌గా చేసుకున్నారు. అతికొత్త మంది ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో జరిగింది. దీంతో వెడ్డింగ్‌ మాత్రం గ్రాండియర్‌గా  ప్లాన్‌ చేశారట. 

తెలుగు, తమిళంలో నటుడిగా రాణిస్తున్న ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి `యాగవరైనమ్‌ నా కక్కా` చిత్రంలో నటించారు. ఇది తెలుగులో `మలుపు`గా విడుదలై ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమా టైమ్‌ లో వీరిద్దరు ప్రేమలో పడ్డారట. ఎట్టకేలకు ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. దీంతోపాటు ఈ ఇద్దరు `మరగద నానయం` అనే చిత్రంలోనూ కలిసి నటించారు. ప్రస్తుతం ఆదిపినిశెట్టి `ది వారియర్‌` చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూపొందుతుంది. ఇటీవల ఆదిపినిశెట్టి `క్లాప్‌`, `గుడ్‌లక్‌ సఖీ` చిత్రాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

AR Rahman: ఏఆర్ రెహమాన్ స్టూడియో నుంచి ఆశా భోంస్లే పరుగులు.. అసలేం జరిగిందంటే?
Jallianwala Bagh Films: జలియన్‌వాలా బాగ్ దురంతం.. వెండితెరపై ఆ నెత్తుటి గాయాన్ని చూపించిన 5 సినిమాలు