కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో AIని ఉపయోగించనున్నారు. ఈ సరికొత్త ప్రయోగాన్ని ‘కట్టప్ప’గా సుపరిచితుడైన సత్యరాజ్ పాత్రపై చేయనున్నారు. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
‘బాహుబలి’ తర్వాత సౌత్ నుంచి సరికొత్త సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులకు కొత్త అంశాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గుహన్ సెన్నియప్పన్ (Guhan senniappan) సరికొత్త ప్రయోగానికి పూనుకున్నారు. గతంలో ‘సవారి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి రిజల్ట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి’ నటుడు ‘కట్టప్ప’గా ఇండియన్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన సత్యరాజ్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
‘వెప్పన్’ అనే టైటిల్ తో తమిళంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సత్యరాజ్ - గుహన్ సెన్నియప్పన్ కాంబోలో వస్తోంది. వసంత్ రవి, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత 68 ఏళ్ల వయస్సున సత్యరాజ్ ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పనులు, పార్లల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో AIని వినియోగించబోతున్నారు. దాంతో సత్యరాజ్ ను యంగ్ గా చూపించబోతున్నారు. ఇలాంటి టెక్నాలజీని హాలీవుడ్ ఫిల్మ్స్ ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి వాటిల్లో వాడారు. ఇక ఇండియన్ ఫిల్మ్స్ లో మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను దర్శకుడు గుహన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. సత్యారాజ్ యంగ్ గా మరియు సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.