Rakesh Master : రాకేష్ మాస్టర్ ఎప్పటికీ గుర్తుండి పోయేలా.. కీలక నిర్ణయం!

By Asianet News  |  First Published Jun 29, 2023, 1:01 PM IST

ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మరణవార్త అందరినీ బాధించింది. దీంతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయేలా కీలక నిర్ణయం తీసుకున్నట్టు శిష్యుడు సత్య మాస్టర్ ప్రకటించారు. 
 


రాకేష్ మాస్టర్ పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాన్ని నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన శిష్యులు శేఖర్, సత్య మాస్టర్స్,, డ్యాన్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలో సంతాప సభను ఏర్పాటు చేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 

ఎంతో మందికి డాన్సర్లుగా, కొరియోగ్రఫర్లుగా జీవితాలు ఇచ్చిన రాకేష్ మాస్టర్ హఠాత్తుగా మరణించడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాకేశ్ మాస్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. సత్య మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ ఎప్పుడూ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాం. అందుకే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాం. ఆయన పేరిట జాతీయ పురస్కారం నెలకొల్పుతున్నట్టు సత్య మాస్టర్ ప్రకటించారు. 

Latest Videos

ఆ వెంటనే తెలుగు టీవీ అండ్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ... ‘రాకేశ్ మాస్టర్ ఎప్పటికీ గుర్తుండేలా సత్య ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. దీంతో శేఖర్ మాస్టర్ సహకారంతో ప్రతి సంవత్సరం రాకేశ్ మాస్టర్ పేరిట పురస్కారం అందిస్తాం‘ అని తెలిపారు. శిష్యులుగా రాకేశ్ మాస్టర్ పై వాళ్లు చూపిస్తున్న ప్రేమకు అందరూ అభినందిస్తున్నారు. 

ఇక ఈనెల 18న వడదెబ్బతో రాకేష్ మాస్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర విరేచనాలతో పాటు రక్తపు వాంతులు జరగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాకేష్ మాస్టర్ మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని కన్నీళ్లతో నివాళి అర్పించారు. 
 

click me!