ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ షురూ చేసారు. ప్రారంభంలో సాఫీగానే సాగినా సెట్స్ లో దాదాపు ఇరవైమందికి కరోనా సోకడం, ఓ వ్యక్తి మరణించటంతో అర్ధాంతరంగా ఈ మూవీ షూటింగ్ ను ఆపేసి హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా మారేడుమిల్లిలో ఐదు రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం “పుష్ప”. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మార్చ్ లోనే ప్రారంభం కావాలి కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడుతూ గత నెలలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ షురూ చేసారు. ప్రారంభంలో సాఫీగానే సాగినా సెట్స్ లో దాదాపు ఇరవైమందికి కరోనా సోకడం, ఓ వ్యక్తి మరణించటంతో అర్ధాంతరంగా ఈ మూవీ షూటింగ్ ను ఆపేసి హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా మారేడుమిల్లిలో ఐదు రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ప్రొడక్షన్ డిజైనర్ ...షూటింగ్ ని కంటిన్యూ చేసేందుకు గాను ఓ ఫారెస్ట్ సెట్స్ ని ..మారేడుమిల్లి ఏజెన్సీని పోలి ఉండేలా రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కసారి సెట్ రెడీ అయ్యితే అల్లు అర్జున్ షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొంటారు. వచ్చే ఆరేడు నెలలో ఈ సినిమాని పూర్తి చేసి కొరటాల శివ నెక్ట్స్ సినిమాకు జాయిన్ కావాలనేది అల్లు అర్జున్ ఆలోచన. అందుకు తగినట్లుగా ప్లానింగ్ చేస్తున్నారు.
మరో ప్రక్క డిసెంబర్ 13 నుండి హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నటీనటుల డేట్స్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవలే నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ వెళ్లగా ఈరోజు రిటర్న్ అయ్యాడు.
మరోవైపు ‘పుష్ప’రాజ్‌ను ఢీకొట్టడానికి టాలీవుడ్ కొత్త విలన్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. ‘డిస్కోరాజా’, ‘కలర్‌ఫొటో’తో తనలోని విలనిజం చూపించిన సునీల్ ‘పుష్ప’కి విలన్ అవుతాడని అంటున్నారు. అలాగే ‘పుష్ప’లో తొమ్మిది మంది విలన్లు ఉంటారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ... టాలీవుడ్‌లో అయితే హాట్ టాపిక్‌గా మారింది.