టైటిల్స్ లో నయా ట్రెండ్‌.. నేడే విడుదల

Published : Dec 10, 2020, 11:49 PM IST
టైటిల్స్ లో నయా ట్రెండ్‌.. నేడే విడుదల

సారాంశం

ఒకప్పుడు సినిమా టైటిల్స్ జానపదాలతో మేళవించి ఉండేవి. ఆ తర్వాత కుటుంబ అనుబంధాల ప్రధానంగా, ఆ తర్వాత పవర్‌ ఫుల్‌ టైటిల్స్ వచ్చాయి. పాటల పేర్లతో టైటిల్స్ వచ్చాయి. ఇప్పుడు టైటిల్స్ మరింత నవ్యతని సంతరించుకుంటున్నాయి. 

సినిమాల్లో మార్పులు సహజమే. ప్రతి ఐదేళ్లకో, పదేళ్ళకో మార్పు జరుగుతుంది. మార్పు సినిమాల నుంచే ప్రారంభమవుతుందని చెప్పినా అతిశయోక్తి లేదు. సినిమాల్లో టైటిల్‌ విషయంలో ఈ మార్పు స్పష్టంగా చూడొచ్చు. ఒకప్పుడు సినిమా టైటిల్స్ జానపదాలతో మేళవించి ఉండేవి. ఆ తర్వాత కుటుంబ అనుబంధాల ప్రధానంగా, ఆ తర్వాత పవర్‌ ఫుల్‌ టైటిల్స్ వచ్చాయి. పాటల పేర్లతో టైటిల్స్ వచ్చాయి. ఇప్పుడు టైటిల్స్ మరింత నవ్యతని సంతరించుకుంటున్నాయి. 

అందుకు నిదర్శనమే `నేడు విడుదల`. సినిమా అంటే గుర్తొచ్చే పేరు `నేడే విడుదల`. సినిమా విడుదలవుతుందని తెలిపేది నేడే విడుదల. తాజాగా అదే టైటిల్‌గా ఓ సినిమా రాబోతుంది. తెలుగులో రామ్‌ పన్నాల దర్శకుడిగా పరిచయం అవుతూ, ఐకా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై అసిఫ్‌ ఖాన్‌, మౌర్యాని దీన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ఫ్రీ లుక్ విడుదల చేశారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా యూనిట్ సభ్యులు ఒక వీడియో విడుదల చేసారు. 

 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయని, అతి తొందర్లో సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ ని విడుదల చేస్తాం అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఆసక్తికరమైన కథతో, ఆలోచింపచేసే కథనంతో, ఆహ్లదపరిచే సంభాషణలతో, విన్నూతనమైన ప్రచారంతో రానుందని తెలిపారు. కాశి విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టి ఎన్ ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ లు నటించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?