నాగ్‌, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ మరో బంపర్‌ ఆఫర్‌..

Published : Feb 05, 2021, 07:41 PM IST
నాగ్‌, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ మరో బంపర్‌ ఆఫర్‌..

సారాంశం

ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్‌, మల్టీటాలెంటెడ్‌ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌ నటిగా, సింగర్‌గా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.  `యమదొంగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ సోయగం.. నాగార్జునతో `కృష్ణార్జున`, `కింగ్‌`, `కేడీ`లతో మెరిసింది. వెంకటేష్‌తో `చింతకాయలరవి`లో నటించింది. 

ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్‌, మల్టీటాలెంటెడ్‌ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌ నటిగా, సింగర్‌గా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.  `యమదొంగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ సోయగం.. నాగార్జునతో `కృష్ణార్జున`, `కింగ్‌`, `కేడీ`లతో మెరిసింది. వెంకటేష్‌తో `చింతకాయలరవి`లో నటించింది. చాలా రోజులుగా మలయాళ సినిమాలకే పరిమితమైన ఈ అమ్మడు తాజాగా విశాల్‌ చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యింది. 

తమిళంలో బిగ్‌ ఆఫర్‌ కొట్టేసింది. `ఎనిమీ` చిత్రంలో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. ఇది తెలుగులోనూ విడుదల కానున్న విషయం తెలిసిందే. విశాల్‌, ఆర్య హీరోలుగా రూపొందుతున్న చిత్రమిది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్య సరసన మమతా మోహన్‌ దాస్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే విశాల్‌ సరసన మృణాలిని రవి నటించనుంది. ఈ సందర్భంగా గురువారం చిత్రంలోని ఆర్య పోస్టర్‌ని విడుదల చేశారు యూనిట్‌. ఇంటెన్స్ లుక్‌లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

ఇక మమతా మోహన్‌ దాస్‌ చాలా రోజులు తర్వాత తమిళ సినిమాలో నటిస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తుంది మమతా మోహన్‌దాస్‌. దీంతోపాటు ప్రభుదేవా సినిమాలో చేస్తుంది. ప్రస్తుతం మలయాళంలో ఏడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్