Pawan kalyan: పవన్ కి బిగ్ షాక్... సినిమాలు వదిలేస్తాడా!

Published : Aug 14, 2022, 06:33 PM ISTUpdated : Aug 14, 2022, 06:38 PM IST
Pawan kalyan: పవన్ కి బిగ్ షాక్... సినిమాలు వదిలేస్తాడా!

సారాంశం

పవన్ కళ్యాణ్ కి పెద్ద భయం పట్టుకుంది. తాజా పరిణామాలతో ఆయన షాక్ తిన్నారు. ఏకంగా సినిమాలు మానేసే అవకాశం కూడా కలదు. ఇంతకీ ఏం జరిగిదంటే...

ఇప్పుడు పవన్(Pawan Kalyan) కి సినిమా కంటే రాజకీయాలే ముఖ్యం. 2024 ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న ఆయన జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన పవన్ కళ్యాణ్ మూడేళ్లు సినిమాలతో గడిపేశాడు. కమ్ బ్యాక్ ప్రకటించిన పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు విడుదల చేశారు. ఇక హరి హర వీరమల్లు(Harihara Veeramallu) సెట్స్ పై ఉండగా... మరో రెండు మూడు చిత్రాలు ప్రకటించారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సమయం రాజకీయ కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు. 

గతంతో పోల్చితే జనసేన ఎంతో కొంత బలపడిందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ తగిలింది. రెండు జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో జనసేన(Janasena) పార్టీ ప్రస్తావనే లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే తేల్చింది. మరో జాతీయ మీడియా వైసీపీకి 19, టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. సదరు మీడియా సంస్థల సర్వే ప్రకారం... వైస్ ఎస్ జగన్ 120 నుండి 130 అసెంబ్లీ స్థానాలు గెల్చుకొని రెండోసారి అధికారం చేపట్టడం ఖాయం. 

అత్యంత విశ్వసనీయ కలిగిన ఈ రెండు సర్వేల్లో జనసేన-బీజేపీ కూటమికి కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు. అంటే జనసేన పార్టీ పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని పవన్ కి అర్థమైంది. మిగిలిన ఈ కొంచెం సమయంలో మరింత కష్టపడి జనాల్లో విశ్వసనీయత సాధించాలని పవన్ భావించే అవకాశం కలదు. ఈ క్రమంలో ఆయన మధ్యలో ఉన్న చిత్రాలతో పాటు ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే ఆలోచన చేయకపోవచ్చు. 2024 లోపు పవన్ నుండి సినిమా రావడం కష్టమే, ఆయన తీరిక లేకుండా రాజకీయాల్లో తలమునకలు అవుతాడని కొందరు అంచనా వేస్తున్నారు. 

అక్టోబర్ 5 నుండి బస్సు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి హాజరయ్యే ఛాన్స్ లేదు. మొత్తంగా ప్రస్తుత సమీకరణాలు పరిశీలిస్తే.. పవన్ సినినిమాలకు దూరమవుతారని అనిపిస్తుంది. మరోవైపు హరి హర వీరమల్లు నిర్మాతల నుండి ఆయన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సినిమా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. అలాగే భవదీయుడు భగత్ సింగ్ నిర్మాతలుగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్  అడ్వాన్సుగా ఇచ్చిన రూ. 40 కోట్లు తిరిగి ఇచ్చేయాలని పవన్ ని కోరుతున్నారట. మొత్తంగా పవన్ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు