95th Oscars: ప్రతిష్టాత్మక బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్ అవార్డులు వీరివే!

Published : Mar 13, 2023, 09:58 AM ISTUpdated : Mar 13, 2023, 10:23 AM IST
95th Oscars: ప్రతిష్టాత్మక బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్ అవార్డులు వీరివే!

సారాంశం

ఆస్కార్ వేదికపై ఉత్తమ నటి అవార్డు అందుకుని మిచెల్ యోహ్ చరిత్ర సృష్టించింది. అలాగే మమ్మీ ఫేమ్ బ్రెండన్ ఫ్రేజర్ తన మొట్టమొదటి అవార్డు సొంతం చేసుకున్నాడు.

లాస్ ఏంజెల్స్ వేదికగా ఆస్కార్ పండుగ జరుగుతుంది. ప్రపంచ సినిమా ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో అత్యంత ప్రతిభ చూపిన నటులు, సాంకేతిక నింపుణులకు అవార్డులు దక్కుతున్నాయి. కాగా ప్రతిష్టాత్మక బెస్ట్ యాక్టర్, యాక్టర్స్ అవార్డులు బ్రెండన్ ఫ్రేజర్,  మిచెల్ యోహ్ గెలుచుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీకి టార్‌ చిత్రం నుండి  కేట్ బ్లాంచెట్, బ్లోండ్‌ చిత్రం నుండి అనా డి అర్మాస్, టు లెస్లీ చిత్రం నుండి ఆండ్రియా రైస్‌బరో, ది ఫాబెల్‌మాన్స్‌ నుండి మిచెల్ విలియమ్స్, ఎవరీ వేర్ ఎవరీ థింగ్ ఆల్ యట్ వన్స్ చిత్రానికి గాను మిచెల్ యోహ్  నామినేట్ అయ్యారు. వీరి నుండి ఎవిరీ వేర్ ఎవిరీ థింగ్ ఆల్ యట్ వన్స్ చిత్రంలో నటనకు మిచెల్ యోహ్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఫస్ట్ ఏషియన్ ఉమన్ గా ఆమె రికార్డు సృష్టించారు. మలేషియాలో పుట్టిన 60 మిచెల్ 20ఏళ్ల వయసులో కెరీర్ మొదలుపెట్టారు. హాంక్ కాంగ్ చిత్రాలతో ఆమె ప్రస్థానం మొదలైంది.  

ఇక బెస్ట్ యాక్టర్ అవార్డుకి ఎల్విస్‌ చిత్రం నుండి ఆస్టిన్ బట్లర్,  ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్‌ చిత్రానికి  కోలిన్ ఫారెల్,  ది వేల్‌ చిత్రం నుండి బ్రెండన్ ఫ్రేజర్,  ఆఫ్టర్‌సన్‌ చిత్రానికి పాల్ మెస్కల్, లివింగ్ చిత్రం నుండి  బిల్ నైజీ నామినేషన్స్ దక్కించుకున్నారు. వీరిలో ది వేల చిత్రంలోని నటనకు గానూ... బ్రెండన్ ఫ్రేజర్ ని అవార్డు వరించింది.  54 ఏళ్ల ఈ సీనియర్ హీరోకి ఇండియాలో కూడా ఫాలోయింగ్ ఉంది. మమ్మీ సిరీస్ ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. మొదటిసారి ఆస్కార్ అందుకున్న బ్రెండన్ భావోద్వేగానికి గురయ్యారు. 

ఇక రెండు ఇండియన్ మూవీస్ ఆస్కార్ వేదికపై సత్తా చాటాయి. ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు ఆస్కార్స్ కైవసం చేసుకున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో అవార్డ్స్ వరించాయి. కార్తీకి, కీరవాణి ఆస్కార్ వేదికపైకి వెళ్లి అవార్డు అందుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు