
తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమా హిస్టరీగా నిలిచింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఇండియాకి రెండు ఆస్కార్లు రావడం ఓ విశేషమైతే, తెలుగు సినిమా `ఆర్‌ఆర్‌ఆర్`కి ఆస్కార్ రావడం మరో విశేషం. దాదాపు 95ఏళ్ల కల నేటితో నిజమైంది. `నాటు నాటు` పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ పురస్కారాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ అందుకున్నారు.
ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు కీరవాణి. ఇది ఇండియా విజయమన్నారు. తమ రాజమౌళి, మా ఫ్యామిలీ విజయంగా తెలిపారు. కార్పెంటర్‌గా ఉన్నప్పట్నుంచి ఆస్కార్ గురించి వింటున్నానని, ఇప్పుడు ఆస్కార్ పొందానని తెలిపారు. పాట రూపంలో ఆయన తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. అందరిని అలరించారు కీరవాణి. ఇందులో చంద్రబోస్ `నమస్తే` అంటూ తెలుగులో తెలియజేయడం విశేషం.
ఇదిలా ఉంటే `నాటు నాటు`కి ఆస్కార్ వెనకాల ప్రధాన కారణం ఏంటనేది చూస్తే, అందులో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఐకానిక్ స్టెప్స్ కారణమని చెప్పొచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన హుక్ స్టెప్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కావడమే కారణమని చెప్పొచ్చు. `నాటు నాటు` పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. స్నేహాన్ని, ఇండియన్ డాన్సుని మేళవించిన పాట ఇది. తెలుగు పాటని, డాన్సుని ఎగతాళి చేసిన క్రమంలో వచ్చే పాట ఇది. అందుకే ఇది ఇండియన్ కల్చర్‌కి నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు ఈ హుక్ స్టెప్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అమెరికా మాత్రమే కాదు, ఇతర దేశాల్లోని సాధారణప్రజలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, పొలిటికల్ లీడర్స్ సైతం ఈ డాన్సు చేయడం విశేషం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోగా, అవి బాగా పాపులర్ అయ్యాయి. అవి ఆస్కార్ వరకు వెళ్లేందుకు కారణమయ్యాయి. ఆ క్రేజ్ ముందు మిగిలిన పాటలు నిలవలేకపోయాయి.
అయితే దీని వెనకాల రాజమౌళి స్ట్రాటజీ కూడా ఉంది. ఎందుకంటే ఆయన అమెరికా వారికి నచ్చేలా అందులోని హీరోల కాస్ట్యూమ్‌ని డిజైన్ చేయించారు. బ్రిటీషర్లని అపోజిట్‌గా పెట్టారు. గ్రీనరీకి పేరొందిన ఉక్రెయిన్‌లో దీన్ని చిత్రీకరించడం వంటివన్నీ ఈ పాటకి కలిసొచ్చిన అంశాలుగా చెప్పొచ్చు. దీని వెనకాలు దర్శకుడు రాజమౌళి పక్కా ప్లాన్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనికితోడు రాజమౌళి ఈ సినిమాని మొదట్నుంచి అంతర్జాతీయంగా ప్రమోట్ చేశారు. ఇండియాలో దీనిపై విమర్శలు వచ్చినా, పట్టించుకోకుండా అంతర్జాతీయంగా ఈ సినిమాని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. జపాన్ వంటి దేశాల్లో పర్యటించి ప్రమోట్ చేశారు.
మరోవైపు కొన్ని కోట్లు పెట్టి ఆస్కార్‌కి ప్రమోషన్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఈ సినిమాని ఆస్కార్‌కి సెలెక్ట్ చేయకపోయినా ప్రైవేట్ పద్ధతుల్లో వెళ్లి ఆస్కార్‌కి నామినేట్ అయ్యేలా చేశారు. చాలా రోజులుగా అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, ఆ పాట గొప్పతనాన్ని వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ గురించి ప్రత్యేకంగా వెల్లడిచారు. అంతేకాదు అమెరికన్లకి రీచ్ అయ్యేలా అక్కడి మీడియాలో `ఆర్‌ఆర్‌ఆర్`, నాటు నాటుపై చర్చ జరిగేలా కేర్ తీసుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ సైతం దీన్ని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
ఇవన్నీ ఓ ఎత్తైతే.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ లు కలిసి ఈ పాటని అద్బుతంగా పాడటం, దాని్ని అంతే అద్భుతంగా సంగీత దర్శకుడు కీరవాని కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటని లిరిక్ రైటర్ చంద్రబోస్ అత్యద్భుతంగా రాయడం కారణంగా చెప్పొచ్చు. హీరోలు వాడిని కాస్ట్యూమ్స్, కెమెరా వర్క్ ఇలా అన్నీ ఈ పాటని అద్భుతంగా, అత్యద్భుతంగా మార్చాయి. ఇప్పుడు చరిత్రకి నాందిగా నిలిచాయి. ఇండియా గర్వపడేలా చేయడంతోపాటు అంతర్జాతీయంగా ఇండియన్ సినిమాలో ముఖ్య స్థానంలో నిలిచేలా చేసింది.