నీ జాతకంకి నమస్కారం.. సమంతపై ఛార్మి కామెంట్స్!

Published : Jul 06, 2019, 10:38 AM IST
నీ జాతకంకి నమస్కారం.. సమంతపై ఛార్మి కామెంట్స్!

సారాంశం

అక్కినేని సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్కినేని సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకులు ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. దీంతో సమంత సంబరాల్లో మునిగిపోయింది.

సోషల్ మీడియా వేదికగా సమంతకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు అందరి ట్వీట్ లకు రిప్లయ్ ఇస్తోంది ఈ బ్యూటీ. సినీ నటి, నిర్మాత ఛార్మి కూడా సమంతని ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది.

''ఏ టైం కి పుట్టావ్ అమ్మ నువ్వు..? నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్ అండ్ నీ జాతకంకి నమస్కారం'' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన సమంత ధన్యవాదాలు తెలిపింది. ఛార్మి ట్వీట్ చూసిన సమంత అభిమానులు దిష్టి తీయించుకో సామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?