డిసెంబర్, జనవరి 2021 లో రిలీజ్ అయ్యే తెలుగు చిత్రాల లిస్ట్

By Surya PrakashFirst Published Nov 26, 2021, 6:46 AM IST
Highlights

 డిసెంబర్ లో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి రెండు తప్పించి మిగిలినవి మాత్రం పెద్ద హీరోల సినిమాలే. వాటిలో మరీ ముఖ్యంగా అందరూ ఆసక్తికా ఎదురుచూసే సినిమా పుష్ప- ది రైజ్ కోసం. దాని తర్వాత బాలయ్య అఖండ, నాని శ్యామ్ సింగరాయ్, వరుణ్ తేజ్ గని, సత్యదేవ్ స్కైలాబ్, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి వీటితో పాటు పలు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

దసరా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలు థియేటర్‌లవైపు క్యూ కడుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి సిద్ధమయ్యాయి. ఇక డిసెంబర్, జనవరి మొత్తం రిలీజ్ లతో ఆక్యుపై అయ్యిపోయాయి. రెండు నెలల్లోనూ పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా!
  
సినిమా పేరు   విడుదల తేదీ
అఖండ    డిసెంబర్ 02
స్కై ల్యాబ్    డిసెంబర్ 04
లక్ష్య    డిసెంబర్ 10
దొరుకునా ఇటువంటి సేవ    డిసెంబర్ 10
గుడ్ లక్ సఖి    డిసెంబర్ 10
పుష్ప ది రైజ్    డిసెంబర్ 17
శ్యామ్ సింగ్ రాయ్    డిసెంబర్ 24
గని    డిసెంబర్ 24
ఆర్ ఆర్ ఆర్     జనవరి 07, 2022
బీమ్లా నాయక్  జనవరి 12, 2022
వలైమలే ( డబ్బింగ్)    జనవరి 13, 2022
రాధే శ్యామ్    జనవరి 14, 2022
బంగార్రాజు    జనవరి 15, 2022 (TBA)
హీరో    జనవరి 26, 2022
శేఖర్ జనవరి 26, 2022 

కోవిడ్ వల్ల గత రెండు సంవత్సరాలుగా తెలుగు పరిశ్రమ లో కళ కాస్త తప్పింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ యాధాస్దితికి వస్తోంది. థియోటర్  లో మళ్లీ సినిమాల రిలీజ్ లు, టీజర్లు, ట్రైలర్ల రిలీజ్ లతో సందడిగా ఉంది. గత రెండు మూడు నెలల నుండే కాస్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా అసలైన సినిమా  పండుగ ఇప్పటినుండి మొదలవ్వబోతుంది.వాస్తవానికి ప్రతి ఏడాది ప్రారంభంలో పెద్ద సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. కానీ ఈసారి మాత్రం ఏడాది చివరి నుండి ఆ సందడి మొదలైంది. వచ్చే నెల, ఆ తర్వాత నెల అంటే డిసెంబర్,జనవరిలో  చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి రెండు తప్పించి మిగిలినవి మాత్రం పెద్ద హీరోల సినిమాలే. 

click me!