ఉత్తమ తెలుగు చిత్రం `జెర్సీ`.. 67వ జాతీయ అవార్డులు

Published : Mar 22, 2021, 04:48 PM IST
ఉత్తమ తెలుగు చిత్రం `జెర్సీ`.. 67వ జాతీయ అవార్డులు

సారాంశం

67వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చేసింది. ఉత్తమ తెలుగు చిత్రంగా `జెర్సీ` చిత్రం ఎంపికైంది. నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరు దర్శకత్వం వహించారు. 2019లో ఈ సినిమా రూపొంది ఘన విజయం సాధించింది. 

67వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చేసింది. ఉత్తమ తెలుగు చిత్రంగా `జెర్సీ` చిత్రం ఎంపికైంది. నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరు దర్శకత్వం వహించారు. 2019లో ఈ సినిమా రూపొంది ఘన విజయం సాధించింది. తాజాగా ప్రాంతీయ భాష చిత్రాల విభాగంలో తెలుగు నుంచి ఇది జాతీయ అవార్డుని దక్కించుకోవడం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.  

అంతేకాదు ఇది మరో జాతీయ అవార్డుని అందుకుంది. ఎడిటింగ్‌ విభాగంలో జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ విభాగంలో ఎంపికయ్యారు.  దీంతో ఇప్పటి రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తమిళంలో ఉత్తమ చిత్రంగా ధనుష్‌ నటించిన `అసురన్‌` ఎంపికైంది. హిందీలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన `చిచ్చోర్‌` చిత్రానికి దక్కింది. 

ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులను ఎంపిక చేశారు. `అసురన్‌` చిత్రానికి ధనుష్‌, హిందీలో మనోజ్‌ బాజ్‌పాయ్‌లను ఎంపిక చేశారు. మరోవైపు ఉత్తమ నటిగా `మణికర్ణిక`, `పంగా` చిత్రాలకుగానూ కంగనా రనౌత్‌లను ఎంపిక చేశారు. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌