కిస్ కావాలన్న ఫ్యాన్ కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ రిప్లై

By team teluguFirst Published Mar 22, 2021, 2:39 PM IST
Highlights

జాన్వీ కపూర్ ఈ ఆదివారం ఆస్క్ అవే పేరుతో ఇంస్టాగ్రామ్ చిట్ ఛాట్ లో పాల్గొన్నారు. నెటిజెన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె  సమాధానం చెప్పారు. ఓ నెటిజన్ మాత్రం.. నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా... అని చిలిపి ప్రశ్న అడిగాడు.

సెలబ్రెటీలకు సోషల్ మీడియా వేధింపు, ఇబ్బందికర సందర్భాలు సర్వసాధారణం. ఓ హీరో లేదా హీరోయిన్ సోషల్ మీడియా ఛాట్ కి అందుబాటులోకి వస్తే చాలు... ఒక్కొక్కరు తమ పైత్యం అంతా బయటపెట్టేస్తారు. ఇబ్బందికర ప్రశ్నలు అడిగి ఇరుకున బెట్టాలని చూస్తారు. తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ కి కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అయితే సదరు నెటిజెన్ ప్రశ్నకు జాన్వీ కపూర్ సావధానంగా, సరైన సమాధానం ఇచ్చింది. 


జాన్వీ కపూర్ ఈ ఆదివారం ఆస్క్ అవే పేరుతో ఇంస్టాగ్రామ్ చిట్ ఛాట్ లో పాల్గొన్నారు. నెటిజెన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె  సమాధానం చెప్పారు. ఓ నెటిజన్ మాత్రం.. నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా... అని చిలిపి ప్రశ్న అడిగాడు. దానికి జాన్వీ కోప్పడకుండా... నో అని సమాధానం చెప్పారు. అలాగే మాస్క్ ధరించి ఉన్న ఫోటో అప్లోడ్ చేశారు. కరోనా సమయంలో ముద్దులు పెట్టుకోకూడదు, సామజిక దూరం అవసరం అని... తనదైన శైలిలో జాన్వీ తెలియజేశారు. 

ఇక జాన్వీ కపూర్ కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. కెరీర్ బిగినింగ్ లోనే ఆమె ప్రయోగాత్మక చిత్రాలు ఎంచుకుంటున్నారు. తాజాగా జాన్వీ రూహి అనే కామెడీ హారర్ మూవీలో నటించారు. మార్చ్ 11న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కిన రూహి చిత్రంలోని శ్రీదేవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
 

click me!