2.0 బాక్స్ ఆఫీస్: ఇప్పుడే అసలైన కలెక్షన్స్ వస్తున్నాయ్!

Published : Dec 03, 2018, 02:01 PM ISTUpdated : Dec 03, 2018, 02:04 PM IST
2.0 బాక్స్ ఆఫీస్:  ఇప్పుడే అసలైన కలెక్షన్స్ వస్తున్నాయ్!

సారాంశం

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ 2.0 మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినీ ఎనలిస్ట్ లు సినిమా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని ముఖ్యంగా వెకెండ్ ఎండింగ్ లో భారీ వసూళ్లను అందుకున్నట్లు చెబుతున్నారు. 

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ 2.0 మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినీ ఎనలిస్ట్ లు సినిమా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని ముఖ్యంగా వెకెండ్ ఎండింగ్ లో భారీ వసూళ్లను అందుకున్నట్లు చెబుతున్నారు. ఇక గురువారం రిలీజైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో నాలుగువందల కోట్లను దాటేసినట్లు తెలుస్తోంది. 

తమిళ సినిమా విశ్లేషకుడు రామేష్ బాలా నేడు తన ట్విట్టర్ లో అధికారికంగా కొన్ని వివరాలను తెలియజేశారు. యూఎస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో  అత్యధిక వసూళ్లను అందుకున్న సౌత్ చిత్రంగా 2.0 నిలిచిందని పేర్కొన్నారు. రంగస్థలం మొత్తంగా 3.5మిలియన్ డాలర్ల లైఫ్ టైమ్ గ్రాస్ ను 2.0 కేవలం నాలుగురోజుల్లోనే క్రాస్ చేసి 4 మిళియన్స్ ను దాటేసింది. 

ఇక నార్త్ అమెరికా సైడ్ లో ఇటీవల రిలీజైన హాలీవుడ్ సినిమాలకంటే శంకర్ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టినట్లు పేర్కొన్నారు. ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ (40.2)ను వెనక్కునెట్టేసి 52.5 మిలియన్‌ డాలర్లతో 2.0 మొదటి స్థానంలో నిలిచినట్లు రమేష్ బాలా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల గ్రాస్ ను అలాగే బాలీవుడ్ సైడ్ 100 కోట్లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?
Sudigali Sudheer Rashmi Gautam లవ్‌ స్టోరీ తెగతెంపులు.. అందరి ముందు ఓపెన్‌గా ప్రకటించిన జబర్దస్త్ కమెడియన్‌