సినిమాలో పవన్ కళ్యాణ్ ని తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

Published : Dec 03, 2018, 01:03 PM IST
సినిమాలో పవన్ కళ్యాణ్ ని తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

సారాంశం

ఎలక్షన్స్ సమయంలో కాస్తంత హైప్ క్రియేట్ చేసిన సినిమా ఆపరేషన్ 2019. ట్రైలర్ చిత్ర యూనిట్ ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. శనివారం రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు ఆపరేషన్ 2019 యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఎలక్షన్స్ సమయంలో కాస్తంత హైప్ క్రియేట్ చేసిన సినిమా ఆపరేషన్ 2019. ట్రైలర్ చిత్ర యూనిట్ ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. శనివారం రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు ఆపరేషన్ 2019 యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. అన్ని ఏరియాల నుంచి మంచి వసూళ్లు కూడా అందుతున్నట్లు వివరణ ఇచ్చారు. 

ఇకపోతే సినిమాలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు సన్నివేశాలు ఉన్నాయనే కామెంట్స్ కు చిత్ర దర్శకుడు కరణం బాబ్జీ క్లారిటీ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి సినిమాలో కామెంట్ చేయలేదని అలాగే మా సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా తిట్టలేదని దర్శకుడిగా కాకుండా బాధ్యత గల పౌరుడిగా భావించి సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. 

ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ రివ్యూలు నిజంగా బాధను కలిగించాయని మాట్లాడారు. సినిమాకు మంచి టాక్ వస్తోంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత కూడా ఆనందంగా ఉన్నారని అయితే రివ్యూలు రాసేవాళ్ళు కూడా కాస్త అలోచించి రాయాలని విమర్శకుల అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవిస్తాం కానీ ఒక సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో పదిమందికి పని, అన్నం దొరుకుతుందని అది ఆలోచించాలని శ్రీకాంత్ తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?
Sudigali Sudheer Rashmi Gautam లవ్‌ స్టోరీ తెగతెంపులు.. అందరి ముందు ఓపెన్‌గా ప్రకటించిన జబర్దస్త్ కమెడియన్‌