26 ఏళ్ల అశ్లీల చిత్రాల నటి దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి..

Published : Apr 01, 2022, 03:14 PM IST
26 ఏళ్ల అశ్లీల చిత్రాల నటి దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి..

సారాంశం

ఆర్థిక సమస్యల కారణంగా పోర్న్ చిత్రాల్లో నటించే వృత్తిని ఎంచుకున్న 26 ఏళ్ల నటి జీవితం విషాదాంతంగా ముగిసింది. ఇటలీకి చెందిన పోర్న్ చిత్రాల నటి చార్లెట్ ఎంజీ ఇటీవల దారుణ హత్యకు గురైంది.

ఆర్థిక సమస్యల కారణంగా పోర్న్ చిత్రాల్లో నటించే వృత్తిని ఎంచుకున్న 26 ఏళ్ల నటి జీవితం విషాదాంతంగా ముగిసింది. ఇటలీకి చెందిన పోర్న్ చిత్రాల నటి చార్లెట్ ఎంజీ ఇటీవల దారుణ హత్యకు గురైంది. ఆమెతో సన్నిహితంగానే ఉండే బ్యాంకర్ డేవిడ్ ఫాంటానా ఆమెని హత్య చేసినట్లు పోలిసుల విచారణలో తేలింది. 

వాస్తవానికి చార్లెట్ ని కొన్ని నెలల క్రితమే డేవిడ్ హత్య చేశాడట. ఇప్పటి వరకు ఆమె మృత దేహాన్ని ఫ్రిజ్ లోనే ఉంచాడు. ఇక ఎక్కువ రోజులు శవం ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదని భావించిన అతడు ముక్కలు ముక్కలుగా నరికి ఓ గ్రామం సమీపంలో రోడ్డు పక్కన చెత్త కుండీలో పడేశాడు. 

ఇన్ని రోజులు పాటు ఆమె గురించి ఎవరూ ఆరా తీయకపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. ఈ నెల 12న ఓ క్లబ్ లో ఎరోటిక్ గా డ్యాన్స్ చేసేందుకు ఆమె ఒప్పందం చేసుకుంది. కానీ ఆమె చనిపోయి ఉండడంతో షోకి హాజరయ్యే వీలు లేదు. దీనితో నిర్వాహకులు అనుమానంతో మీడియాకి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఆమె శరీరం గుర్తులు, టాటూ ఆధారంగా ముక్కలుగా నరికివేయబడింది చార్లెట్ అని పోలీసులు గుర్తించారు. కాల్ డేటా పరిశీలించిన పోలీసులు డేవిడ్ ని అనుమానంతో అరెస్ట్ చేశారు. పోలిసుల విచారణలో చార్లెట్ ని హత్య చేసింది తానే అని అంగీకరించినట్లు తెలుస్తోంది. చార్లెట్ ఫోన్ తన దగ్గర ఉండడంతో మెసేజ్ లకు రిప్లై ఇస్తూ ఆమె బ్రతికే ఉన్నట్లు అందరిని ఇన్ని రోజులు నమ్మించాడు. చార్లెట్ ఆ షోకి హాజరు కాకపోవడంతో అతడి బండారం బయట పడింది. 

చార్లెట్ ఓ పెర్ఫ్యూమ్ షాప్ లో సేల్స్ వుమెన్ గా పనిచేస్తూ ఉండేది. కోవిడ్ కారణంగా ఆమె జాబ్ పోయింది. దీనితో చార్లెట్ కు ఆర్థిక సమస్యలు తీవ్రం అయ్యాయి. తప్పని పరిస్థితుల్లో పోర్న్ చిత్రాల్లో నటించడం ప్రారంభించింది. సొంతంగా అడల్ట్ వీడియోలు చేసి వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసింది. ఆమెకు డేవిడ్ కెమెరా మెన్ గా పనిచేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?