Devara : భయానికి కొత్తపేరు ‘దేవర’.. స్పెషల్ పోస్టర్ వదిలిన టీమ్..

Published : Nov 07, 2023, 06:32 PM IST
Devara : భయానికి కొత్తపేరు ‘దేవర’.. స్పెషల్ పోస్టర్ వదిలిన టీమ్..

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. దేవర చూపించే భయానికి సిద్ధమవ్వండి అంటూ.. సినిమాపై మరింత హైప్ పెంచేలా మేకర్స్ అప్డేట్ అందించారు.   

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR)  నటిస్తున్నభారీ యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నవిషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కీలక సన్నివేశాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. 

ఇప్పటికే చిత్రంలో అండర్ వాటర్ భారీ యాక్షన్ సీన్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. రీసెంట్ గా గోవా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని సమాచారం. దీంతర్వాత వైజాగ్, గోకర్ణ తీర పాంత్రంలో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఎలాగైన ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని కొరటాల శివ కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. హైప్ క్రియేట్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసింది టీమ్.

‘దేవర’ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నేటితో సరిగ్గా 150 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా 150 Days to go Devara అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. సముద్రతీరాన కొండచరియపై ఎన్టీఆర్ కత్తులతో కాపాలా కాస్తున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. భయానికి కొత్త పేరు దేవర అంటూ పోస్టర్ ను వర్ణించింది యూనిట్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

‘దేవర’ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం విశేషం. భారీ యాక్షన్ సీన్లు ఉండటంతో గ్రాఫిక్ విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఈ చిత్రంలో ఊర్వశీ రౌటేలా ఐటెమ్ సాంగ్ చేయబోతుండటం విశేషం. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)  విలన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండటం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్