మాస్ కా దాస్ త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో అలరించబోతున్నారు. ఆ వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చివరిగా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించారు. ఆయనే దర్శకత్వం వహించి నటించిన ఈ మూవీ ఆశించినస్థాయిలో రిజల్ట్ ను ఇవ్వలేకపోయింది. అయినా మాస్ కా దాస్ క్రేజ్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. దీంతో నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. సరిగ్గా రెండు నెలల్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ Gangs of Godavari అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మరోవైపు ఎప్పుడో ప్రారంభమైన ‘గామీ’ అనే చిత్రాన్ని కూడా ఆ వెంటనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎలాంటి అప్డేట్ రాని ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. Gaami చిత్రం అడ్వెంచర్, థ్రిల్లర్ డ్రామాగా రూపుదిద్దుకుందని తెలిపారు. యూవీ క్రియేషన్స్, కార్తీక్ క్రియేషన్స్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీశ్ నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఎడిటింగ్ పూర్తైందని వెల్లడించారు. సినిమా రన్ టైమ్ ను 2 గంటల 24 నిమిషాలకు లాక్ చేసినట్టు తెలిపారు. మూవీకి విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కలర్ ఫొటో’ హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
undefined
ఇక ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’.. 1980లో గోదావరి నేపథ్యంలో జరిగే కథగా రాబోతున్నారు. ఈ పొటిలికట్ డ్రామాలో లంకల రత్న అనే పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. డీజేటిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. హీరోయిన్ అంజలి, కమెడియన్ హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.