
ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ ను, రియాలిటీ షోలను అందించడంలో ‘జీ తెలుగు’వారి ఓర్పునేర్పుకు మెచ్చుకోదగినదే.. అమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో మన జీ తెలుగు వారి షోస్ కూడా అంతే ఆప్యాయతల్ని, మధురానుభూతుల్ని పంచి పెడతాయి. అలాంటి ఛానల్ నుంచి అందరు మెచ్చిన, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో 'స రి గ మ ప' మరోసారి ఒక కొత్త సీజన్ తో మన ముందుకు వచ్చేస్తోంది. గతంలో వచ్చిన సీజన్ 13 ‘స రి గ మ ప : ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్’ విజయవంతం అయ్యింది. ఈ షోకు జడ్జీలుగా సినీ ప్రముఖులు ‘కోఠి, ఎస్పీ శైలజా, చంద్రబోస్’ వ్యవహరించారు. ప్రదీప్ మాచీరాజు వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ షో మొత్తం 30 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. విన్నర్ గా ‘కొండేపూడి యశస్వి’, రన్నరప్ గా ‘భరత్ రాజ్’ నిలిచారు.
మరోసారి సింగింగ్ రియాలిటీ షోతో ప్రేక్షకుల హ్రుదయాలను గెలుచుకునేందుకు ‘స రి గ మ ప : ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్’తో మన ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 20 న సాయంత్రం 6 గంటలకు. రెండు నెలల ముందు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ షో ఇప్పుడు ప్రతిభావంతులైన సింగర్స్ ని తన వేదిక మీదకు తీసుకొచ్చింది. అందులో ఎవరు ముందుకి వెళ్తారు, ఎవరు వెనుతిరుగుతారో తెలియాలంటే, ఫిబ్రవరి 27 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ‘జీ తెలుగు’లో ఈ షోను వీక్షించాల్సిందే.
టాలీవుడ్ సంగీత ప్రపంచంలోని దిగ్గజాలను మెంటార్స్ గా ఈ సీజన్ లో ప్రవేశ పెడుతుంది. గీతా మాధురి (Geetha Madhuri), రేవంత్, శ్రీ కృష్ణ మరియు సాకేత్ వారి అనుభవాలతో, వారి సంగీత విజ్ఞానంతో సానపెట్టడానికి ఈ సీజన్ కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు - మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్ ఎస్ పి శైలజ, సింగర్ స్మిత మరియు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్( Anata Sriram) వ్యవహరించనున్నారు. కాగా ఈ షోకు వ్యాఖ్యాతగా యాంకర్ శ్రీ ముఖి ( Anchor Srimukhi) వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ తెలుగు, అనురాధ గూడూరు ఈ షో గురించి మాట్లాడుతూ.. ‘స రి గ మ ప’షో మాత్రమే కాదు, ఎంతో మంది తలరాతల్ని మార్చిన ఒక వేదిక. అలాంటి షో ని మేము మళ్లీ అందరి ముందుకి కొత్త సీసన్ తో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘సింగింగ్ సూపర్ స్టార్’ జడ్జెస్ లో ఒకరైన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ "నేను స రి గ మ ప తో మొదటి నుంచి ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు 14 వ సీజన్ తో మళ్లీ అందరిముందుకి వస్తున్నాం. టీవీ ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తునందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సారి కూడా మీ అందరి అంచనాలని దాటి మెరుగైన గాయనీగాయకులని పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
సింగర్ ఎస్పీ శైలజ మాట్లాడుతూ ‘మరోసారి అందరిని స రి గ మ ప ద్వారా కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఈ వేదిక ప్రతిభావంతులని అక్కున చేర్చుకొని వారికివారే సాటి అనే విధంగా తీర్చిదిద్దుతుంది’ అని పేర్కొన్నారు. అలాగే జడ్జెస్ స్మిత, అనంత శ్రీ రామ్ కూడా మాట్లాడుతూ ఈ స్టేజి మీదికి రావాలంటే ఎంత కష్టపడ్డాలో నేను ఉహించగలను. ఈ సీజన్ లో క్వాలిటీ సంగీతం తో పాటు గుండెకు హత్తుకొనే ఎన్నో కథలని అందరు చూడగలుగుతారు. వారి పాటలే కాదు వారి కథలు కూడా అందరికి ప్రేరణగా నిలుస్తాయని భావిస్తున్నాం.